వచ్చే ఏడాది 5 సినిమాలు

Saturday,December 07,2019 - 02:12 by Z_CLU

టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా హాట్ అనిపించుకుంటోంది పూజా హెగ్డే. ఆమె నటించిన హౌజ్ ఫుల్4 సినిమాకు కలెక్షన్ వర్షం కురిసింది. దీంతో ఈ రెండు ఇండస్ట్రీస్ నుంచి ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఆమె వచ్చే ఏడాదికి ఆల్రెడీ 5 సినిమాలు రెడీ చేసింది. మరో 2 సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి.

అల వైకుంఠపురం సినిమాతో వచ్చే ఏడాది పూజా ప్రస్థానం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అఖిల్ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే ప్రభాస్ తో చేస్తున్న జాన్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఇలా తెలుగులో పూజా నుంచి 3 సినిమాలు రాబోతున్నాయి.

అటు బాలీవుడ్ లో సాజిద్ నడియావాలా నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించింది పూజా హెగ్డే. దీంతో పాటు మరో సినిమాకు సైన్ చేశానని, ఆ ప్రాజెక్ట్ ను అప్పుడే ఎనౌన్స్ చేయనంటోంది. ఈ 5 సినిమాలతో పాటు వీలైతే తెలుగులో ఒకటి, హిందీలో మరొక సినిమా చేసే ప్లాన్స్ లో ఉంది ఈ బ్యూటీ.