WooAaAhaAha సూపర్ హిట్ సాంగ్ కి 5 మిలియన్ వ్యూస్

Monday,April 25,2022 - 04:41 by Z_CLU

5 Million Views for Super Hit Romantic Number ‘Woo Aa Aha Aha’

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 3’. తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఆల్బం నుండి రిలీజైన సెకండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ భారీ వ్యూస్ కొల్లగొట్టి అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సాంగ్ 5 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి ట్రెండింగ్ లో నిలిచింది. తమన్నా , మెహ్రీన్ లతో కలర్ఫుల్ అండ్ గ్లామరస్ గా డిజైన్ చేసిన ఈ సాంగ్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తుంది.

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయనుంది.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైదిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత.ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.

Woo Aa Aha Aha Lyrical Song

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics