ఒక్క పాట కోసం వేల మంది సైరా

Friday,September 27,2019 - 04:24 by Z_CLU

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్యన విడుదల కాబోతోంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మేటర్ బయటకొచ్చింది. సినిమాలో ఒక జాతర పాట ఉంటుంది.. ఈ జాతర పాటలో ఏకంగా 4500 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారట.

ఇంతమందితో, 14 రోజుల పాటు ఈ ఒక్క సాంగ్ కోసం షూట్ చేశారట. ఒక్క పాట కోసం ఇంత మంది డ్యాన్సర్లను తీసుకోవడం ఇండియాలో ఇదే ఫస్ట్ టైమ్. ఇలా సైరా, విడుదలకు ముందే రికార్డులు సృష్టించడం మొదలు పెట్టింది.