ఈ ఏడాది రాజ్ తరుణ్ నుంచి 4 సినిమాలు

Thursday,January 04,2018 - 06:50 by Z_CLU

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్… న్యూ ఇయర్ లో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు. 2018లో ఈ హీరో నుంచి ఏకంగా 4 సినిమాలు రాబోతున్నాయి. ఇది పక్కా.

 

ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే 2 సినిమాలు కంప్లీట్ చేశాడు రాజ్ తరుణ్. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై చేసిన రంగులరాట్నం సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ ఇయర్ ఈ సినిమాతోనే బోణీ కొట్టబోతున్నాడు రాజ్ తరుణ్.

 

రంగులరాట్నం తర్వాత మినిమం గ్యాప్ లో రాజుగాడు సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తిచేసుకుంది. నిజానికి ఈ మూవీని కూడా సంక్రాంతికే రిలీజ్ చేసేద్దామని కూడా భావించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన రాజుగాడు.. ఈ ఇయర్ ఫస్టాఫ్ లోనే థియేటర్లలోకి రావడం గ్యారెంటీ.

 

రాజ్ తరుణ్ నుంచి రాబోతున్న మూడో సినిమా లవర్. దిల్ రాజు బ్యానర్ పై ఈ సినిమా లాంఛ్ అయింది. షూటింగ్ కూడా నడుస్తోంది. అలా ఎలా ఫేం అనీష్ కృష్ణ డైరక్షన్ లో ఇది రాబోతోంది. రంగులరాట్నం, రాజుగాడు తర్వాత రాబోయేది లవర్ సినిమానే.

 

పైన చెప్పుకున్న 3 సినిమాలతో పాటు మరో సినిమాను కూడా ఇదే ఇయర్ లో విడుదల చేయబోతున్నాడు రాజ్ తరుణ్. కుమారి 21-ఎఫ్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ.. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మాతగా సినిమా చేస్తాడు.ఇలా 2018లో 4 సినిమాల్ని రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు ఈ యూత్ అండ్ ఎనర్జిటిక్ స్టార్.