నాని కోసం నలుగురు వెయిటింగ్

Saturday,October 21,2017 - 02:01 by Z_CLU

ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీతో పాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు త్వరలోనే మరో 4 సినిమాలు ఎనౌన్స్ చేయబోతున్నాడు నేచురల్ స్టార్. ఆ మూవీస్ వివరాలేంటో చూద్దాం

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని. అశ్వనీదత్ నిర్మాతగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా రానుంది. ఇదొక మల్టీస్టారర్ మూవీ. నాగ్, నాని హీరోలుగా నటించబోతున్నారు. జనవరి నుంచి సెట్స్ పైకి రానుంది.

దర్శకుడు కిషోర్ తిరుమలతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీకి చిత్రలహరి అనే డిఫరెంట్ టైటిల్ అనుకుంటున్నారు. అయితే ఇదింకా పూర్తిగా స్క్రీన్ ప్లే రూపంలోకి రాలేదు. ప్రస్తుతం చర్చల దశలో ఉందని కిషోర్ తిరుమల ప్రకటించాడు.

నాని లిస్ట్ లో ఉన్న మరో దర్శకుడు హను రాఘవపూడి. మిలట్రీ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రానుంది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు హను.

దర్శకుడు శేఖర్ కమ్ములతో కూడా స్టోరీ డిస్కషన్స్ లో ఉన్నాడు నాని. ఫిదా తర్వాత మరోసారి ట్రాక్ లోకొచ్చిన ఈ డైరక్టర్, నాని కోసం ఓ స్టోరీలైన్ అనుకున్నాడట. ఇది కూడా వచ్చే ఏడాది చివర్లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.