Balakrishna - అభిమానులకు 3 అప్ డేట్స్!

Saturday,June 05,2021 - 03:34 by Z_CLU

బాలయ్య సినిమాల నుండి అభిమానులకు వరుస అప్ డేట్స్ రాబోతున్నాయి. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా అఖండ సినిమాకు సంబంధించి ఓ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే బర్త్ డే ట్రైలర్ కి సంబంధించి వర్క్ జరుగుతుంది. ఇప్పటికే రెండు టీజర్స్ తో ఇటు ఫ్యాన్స్ ని అటు ఆడియన్స్ ని మెప్పించిన బోయపాటి ఈసారి రిలీజ్ చేయబోయే ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచే ప్లాన్ లో ఉన్నాడు.

‘అఖండ’ సినిమా నుండి మాత్రమే కాదు బాలయ్య నటించబోయే మరో రెండు సినిమాల అప్ డేట్స్ రాబోతున్నాయి. బాలయ్య నెక్స్ట్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను బాలయ్య జన్మదిన సందర్భంగా అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ కాంబో సినిమా రెడీ షూట్ స్టేజిలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై రవి , నవీన్ లు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించనున్నాడు.

ఇక బాలయ్య -గోపీచంద్ మలినేని సినిమాతో పాటు బాలయ్య -అనిల్ రావిపూడి సినిమా ప్రకటన కూడా రాబోతుంది. బాలయ్య కి పుట్టిన రోజు విషెస్ చెప్తూ సినిమాను ప్రకటించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బేనర్ పై హరీష్ పెద్ది , సాహు గారపాటి నిర్మించబోయే ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ రెండు సినిమాల నుండి కేవలం ప్రకటన మాత్రమే రానుండా ? లేదా ఇంకా ఏవైనా డీటెయిల్స్ చెప్తారా ? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా బాలయ్య పుట్టిన రోజు అభిమానులకి ఇలా ట్రిపుల్ బొనంజా అందనుంది. ఈ అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఖుషి అవ్వడం ఖాయం.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics