ఒకే నెలలో 3 పెద్ద సినిమాలు

Tuesday,January 01,2019 - 01:31 by Z_CLU

ఈ ఇయర్ సమ్మర్ మరింత స్పెషల్ కానుంది. 3 మోస్ట్ అవేటెడ్ సినిమాలు ఒకే నెలలో రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. మహేష్ బాబు ‘మహర్షి’, నాని ‘జెర్సీ’, చైతు సమంతాల ‘మజిలీ’ ఏప్రిల్ లోనర్ రిలీజ్ అవుతున్నాయి.

 

మహేష్ బాబు 25 వ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఫ్యాన్స్ లో ఏ రేంజ్ డిమాండ్ క్రియేట్ అయి ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.  ఏ మాత్రం హడావిడి లేకుండా, తీరిగ్గా మహేష్ బాబు ఫ్యాన్స్ అంచనాలను రీచ్ అయ్యే రేంజ్ లో సినిమాని తెరకెక్కిస్తున్నాడు వంశీ పైడిపల్లి. ఈ సినిమా ఏప్రియల్ 5 న రిలీజవుతుంది.

ఇక ఇదే నెలలో సరికొత్తగా రొమాంటిక్ సీజన్ క్రియేట్ కానుంది. పెళ్ళి తరవాత ఫస్ట్ టైమ్ ‘మజిలీ’ కోసం జోడీ కట్టారు సమంతా, నాగచైతన్య. మ్యాగ్జిమం రియలిస్టిక్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. ఈ సినిమా ఏప్రిల్ 12 న రిలీజవుతుంది.

ఇక ఈ ఏప్రిల్ లోనే 19 న రిలీజవుతుంది నాని ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. మ్యాగ్జిమం సినిమా 1996 – 97 రంజీ ట్రోఫీ సీజన్ చుట్టూ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.