'3' నెలల ముందే..
Tuesday,September 20,2016 - 11:19 by Z_CLU
24 సినిమా తరువాత హరి దర్శకత్వం లో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘సింగం-3. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. గతం లో సూర్య-హరి కాంబినేషన్ లో రూపొందిన ‘సింగం’ మరియు ‘సింగం-2 సినిమాలు ఘన విజయం సాధించడం తో మరో సారి ఈ కాంబినేషన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ఈ సినిమా విడుదల తేదీ ను ప్రకటించారు యూనిట్. డిసెంబర్ 16 న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ‘సింగం-3 తో ఇలా 3 నెలల ముందే థియేటర్స్ పై కర్చీఫ్ వేసేశాడు సూర్య.