24 గంటల్లోనే 3 మిలియన్ వ్యూస్

Tuesday,July 24,2018 - 12:30 by Z_CLU

సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఏకంగా 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు గీతగోవిందం టీజర్ కూడా అంతే పెద్ద సక్సెస్ అయింది. నిన్న రిలీజైన ఈ టీజర్ కు 24 గంటలైనా గడవకముందే అప్పుడే 30 లక్షల వ్యూస్ వచ్చాయి. గంటగంటకు ఈ లెక్క పెరుగుతూనే ఉంది.

“నేను మారిపోయా.. కంప్లీట్లీ డీసెంట్ నౌ” అంటూ టీజర్ లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ కు హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అయింది ఈ టీజర్. ఈ ఆదివారం రాబోతున్న జ్యూక్ బాక్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పరశురాం డైరక్ట్ చేసిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. ఆగస్ట్ 15న థియేటర్లలోకి జంటగా రాబోతున్నారు గీత అండ్ గోవింద్.