ముగ్గురూ రె'ఢీ'

Sunday,August 06,2017 - 11:30 by Z_CLU

ప్రతీ వీకెండ్ చిన్న సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కుర్ర హీరోలు పోటీ పడుతుండడం సహజమే..అయితే ఈ వీకెండ్ మాత్రం ఓ ముగ్గురు స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు. ఈ శుక్రవారం నితిన్ ‘లై’ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుండగా రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ తో రానున్నాడు. ఇక మరో యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ కూడా ‘జయ జానకి నాయక’ సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు..


ఇటీవలే ‘అ ఆ’ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నితిన్ హను రాఘవపూడి డైరెక్షన్ లో నటించిన లై సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్,సాంగ్స్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసి సినిమా పై సరి కొత్త అంచనాలు నెలకొల్పాయి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్, రామ్, గోపీ లు నిర్మించిన ఈ సినిమా హను మేకింగ్ స్టైల్ తో మణి శర్మ మ్యూజిక్ తో అదిరిపోయే ట్విస్టులతో అందరినీ ఎంటర్టైన్ చేస్తుందంటున్నారు మేకర్స్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11 నుంచి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతుంది.


తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమా పై క్యూరియాసిటీ నెలకొల్పి సినిమా పై ఉన్న అంచనాలను తారా స్థాయికి చేర్చేశాయి. జోగేంద్ర అనే పొలిటికల్ లీడర్ గా రానా, రాధ పాత్రా లో కాజల్, లక్ష్మి భూపాల్ డైలాగ్స్, తేజ స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తుంది. ప్రెజెంట్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా ఆగస్టు 11 నుంచి సందడి చేయనుంది.

ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన ‘జయ జానకి నాయక’ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. బోయపాటి మార్క్ యాక్షన్ తో ఫ్యామిలీ & యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లం కొండ శ్రీనివాస్ యాక్షన్, ఫైట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాంటిక్ సీన్స్ సినిమాకు హైలైట్స్ గా నిలుస్తాయనే టాక్ వినిపిస్తుంది. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం నుంచి థియేటర్స్ లో హంగామా చేయబోతుంది.

ఒకే రోజు మూడు సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయి బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ గా సందడి చేయబోతున్న ఈ ముగ్గురు స్టార్ హీరోలకు అల్ ది బెస్ట్ చెప్తుంది జీ సినిమాలు…