2.0 ఫస్ట్ డే కలెక్షన్

Friday,November 30,2018 - 12:16 by Z_CLU

రజనీకాంత్, శంకర్ కాంబోలో తెరకెక్కిన 2.0 సినిమా తెలుగు రాష్ట్రాల్లో దుమ్ముదులిపింది. ఏపీ, నైజాంలో అటుఇటుగా 1100 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు 12 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. సూపర్ స్టార్ నటించిన ఏ సినిమాకు తెలుగులో మొదటి రోజు ఇంత షేర్ రాలేదు.

పైగా ఈ సినిమా గురువారం విడుదలైంది. శుక్రవారంతో పాటు శని, ఆదివారం వీకెండ్ ఉండనే ఉంది. సో.. వీకెండ్ కలెక్షన్ లో 2.0 సినిమా సరికొత్త రికార్డు సృష్టించడం గ్యారెంటీ. వరల్డ్ వైడ్ నిన్న గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది

ఏపీ,నైజాం ఫస్ట్ డే షేర్

నైజాం – రూ. 4.73 కోట్లు
సీడెడ్ – రూ. 2.02 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.65 కోట్లు
ఈస్ట్ – రూ. 0.96 కోట్లు
వెస్ట్ – రూ. 0.75 కోట్లు
గుంటూరు – రూ. 1.05 కోట్లు
కృష్ణా – రూ. 0.70 కోట్లు
నెల్లూరు – రూ. 0.73 కోట్లు