ఫ్యాన్స్ కోసం 2.0 పోస్టర్ పోటీ

Saturday,October 27,2018 - 01:27 by Z_CLU

అభిమాన నటుడి సినిమా వస్తుందంటే హంగామా మాములుగా ఉండదు. మరీ ముఖ్యంగా ఈ వేడిలో ఫ్యాన్స్ మేడ్ పోస్టర్ల హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. కొన్ని పోస్టర్లు చూస్తే వాటిని ఫ్యాన్స్ డిజైన్ చేశారో, సినిమా యూనిట్టే రిలీజ్ చేసిందో కూడా అర్థం కాదు. అంత క్రియేటివ్ గా ఉంటాయి. అందుకే ఆ క్రియేటివిటీని వాడుకోవాలని ఫిక్స్ అయింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ.,

రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 2.0 సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి అలాంటి పోస్టర్లను ఎక్కడపడితే అక్కడ పోస్ట్ చేయొద్దంటోంది యూనిట్. వాటిని తమకు పంపిస్తే, వాటిల్లోంచి ది బెస్ట్ సెలక్ట్ చేసి రోజుకు 3 చొప్పున పోస్ట్ చేస్తామని ప్రకటించింది.

అన్నింటికంటే ది బెస్ట్ వర్క్ ను 2.0 యూనిట్ తో కూడా ఆవిష్కరిస్తామని ప్రకటించింది. ఔత్సాహిక డిజైనర్లు, క్రియేటివ్ జనాలకు ఇది నిజంగా గొప్ప అవకాశం. ఏకంగా రజనీకాంత్ దృష్టిలో పడే ఛాన్స్ ఇది.