24 కిసెస్ ట్రైలర్ లాంచ్

Saturday,October 27,2018 - 10:36 by Z_CLU

సిల్లీ మాంక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పించు రెస్పెక్ట్ క్రియేషన్స్ వారి అనీల్, సంజయ్ నిర్మించిన చిత్రం 24 కిసెస్. అయోధ్యకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అదిత్ అరుణ్, హెబ్బాపటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

డైరెక్టర్ అయోధ్య మాట్లాడుతూ… ట్రైలర్ చూసి నచ్చిందో లేదో మీరే చెప్పాలి అన్నారు. నరేష్‌గారు సినిమా గురించి ఆల్‌రెడీ చెప్పారు. 24 కిసెస్ ఉన్నాయి ఈ చిత్రంలో అని రారు. కంటెంట్ ఉంటే తప్పకుండా ఆదరిస్తారు. అని అన్నారు.

హీరో అనిరుధ్ మాట్లాడుతూ… హీరో నాని ఒక ఆడియో ఫంక్షన్‌లో చెప్పారు నువు ఏదన్నా లవ్ స్టోరీ చేస్తే బావుంటుందని కాని నేను ఇప్పటివరకు అన్నీ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వెళ్ళాను. ప్రతి లవ్ స్టోరీలో ఇంటర్‌నల్ కాన్‌ఫ్లిక్ట్, అలాగే సినిమాలో ఇగో కూడా కనిపిస్తుంది. సినిమా బ్యానర్‌కి తగ్గట్టుగా ఉంటుంది. ఈ సినిమాకి ఇద్దరు పెద్ద పిల్లర్లు ఒకరు సీనియర్‌నరేష్‌గారు, ఇంకొకరు రావురమేష్‌గార. వీళ్ళిద్దరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు.