'22' ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్

Tuesday,January 07,2020 - 04:04 by Z_CLU

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ’22’ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసాడు. క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పూరి శిష్యుడు శివ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హీరో రూపేష్ కుమార్ ను పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తూ ఫస్ట్ గ్లిమ్స్ తో ఎట్రాక్ట్ చేసాడు దర్శకుడు.

లాంచ్ అనంతరం పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ” శివ నా దగ్గర చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. తన మీద నాకు చాలా నమ్మకం ఉంది. ’22’ తో డైరెక్టర్ గా మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను” అన్నాడు.

ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది.