2022 Year end వీళ్ళు మిస్సయ్యారు

Monday,December 12,2022 - 02:46 by Z_CLU

 ఈ ఏడాది ఆల్మోస్ట్ అందరి హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చేశాయి. అలాగే స్టార్ డైరెక్టర్స్ అందరూ తమ సినిమాలతో ఎంటర్టైన్ చేశారు. కానీ కొందరు మాత్రం ఈ ఇయర్ మిస్సయ్యారు. మరి 2022 ని మిస్ అయిన వాళ్ళెవరో రౌండప్ లో చూద్దాం.

pushpa movie allu arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. గతేడాది చివర్లో ‘పుష్ప ది రైజ్’ సినిమాతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన బన్నీ ఈ ఇయర్ క్యాలెండర్ లో ఎక్కడా తన సినిమాతో కనిపించలేదు. అన్ని అనుకున్నట్లు జరిగితే అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ ఈ ఏడాది థియేటర్స్ లోకి రావాలి. కానీ అనుకున్న టైంకి సెట్స్ పైకి వెళ్ళని కారణం చేత ఈ ఇయర్ సినిమా రాలేదు. ఈ ఏడాది మిస్ అయినప్పటికీ వచ్చే ఏడాది మాత్రం బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్ రాంపేజ్ ఉండనుంది.

Sukumar-interview-about-pushpa-zeecinemalu

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ నుండి కూడా ఈ ఏడాది సినిమా రాలేదు. బన్నీ మిస్ అయిన కారణమే సుక్కుకి కూడా వర్తిస్తుంది. వచ్చే ఏడాది పుష్ప 2 తో మళ్ళీ వసూళ్ళు రాబట్టే ప్రయత్నంలో ఉన్నాడు సుక్కు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా కూడా ఈ ఏడాది రాలేదు. సహజంగా త్రివిక్రమ్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్ కి క్యూ కడతారు. కానీ ఈ ఇయర్ అంతా మహేష్ తో చేయబోయే ప్రాజెక్ట్ వర్క్ మీదే టైం స్పెండ్ చేశాడు త్రివిక్రమ్. దీంతో ఈ ఇయర్ దర్శకుడిగా ఆయన మిస్ కొట్టాల్సి వచ్చింది. వచ్చే ఏడాది మహేష్ తో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సాలిడ్ కంటెంట్ తో రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్.

స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన హరీష్ శంకర్ నుండి కూడా ఈ ఏడాది సినిమా రాలేదు. గత రెండేళ్ళుగా రిలీజ్ క్యాలెండర్ లో మిస్ అవుతున్న హరీష్ శంకర్ వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ తో తీస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో సాలిడ్ గా రాబోతున్నాడు. రెండేళ్లుగా పవన్ డేట్స్ కోసం ఎదురుచూసిన హరీష్ తాజాగా పవన్ తో సినిమాను స్టార్ట్ చేసేసి సెట్స్ పైకి పెట్టేశాడు. ఓపెనింగ్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేశాడు.

Anushka-nishabdham-movie-నిశ్శబ్దం-మూవీ-fpc-zeecinemalu

ఈ ఇయర్ స్టార్ హీరోయిన్స్ కూడా థియేటర్స్ లో కనిపించలేదు. ఈ లిస్టులో ముందు వరుసలో ఉంది అనుష్క. అవును స్వీటీ నుండి ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. 2020 లో నిశ్శబ్దం అనే సినిమాతో ఒటీటీ ఆడియన్స్ ను పలకరించిన అనుష్క ఆ సినిమా తర్వాత బాగా గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేస్తుంది స్వీటీ. ఈ సినిమాతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

kajal aggarwal saree look stills

కాజల్ కూడా ఈ ఇయర్ థియేటర్స్ లో కనిపించలేదు. చిరంజీవి తో కలిసి ‘ఆచార్య’లో నటించినప్పటికీ ఆమె పాత్రను తొలగించి రిలీజ్ చేశారు. దాంతో ఆమె స్క్రీన్ పై కనిపించలేదు. పైగా ఈ ఏడాది తల్లి కావడంతో షూటింగ్స్ కి బ్రేక్ తీసుకుంది.

యంగ్ హీరోలు సాయి ధరం తేజ్ , అఖిల్ అక్కినేని , బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు కూడా ఈ ఏడాది రాలేదు. అఖిల్ ఈ ఏడాదంతా ‘ఏజెంట్’ షూట్ తోనే గడిపేశాడు. ఇక సాయి ధరం యాక్సిడెంట్ కారణం చేత ఈ ఇయర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. బెల్లంకొండ ఈ ఏదాడి మొత్తం ఛత్రపతి మీదే ఫోకస్ పెట్టి వర్క్ చేశాడు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics