2022 Year End డెబ్యూ హీరోయిన్స్

Thursday,December 22,2022 - 04:10 by Z_CLU

ఈ ఏడాది చాలా మంది కొత్త హీరోయిన్స్ తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. కొందరు మొదటి సినిమాతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి హీరోయిన్ గా బిజీ అయితే మరికొందరు సక్సెస్ అందుకోలేకపోయారు. ఇంతకీ 2022 లో డెబ్యూ ఇచ్చిన హీరోయిన్స్ ఎవరు ? అందులో ఎంత మంది సక్సెస్ అయ్యారు ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ స్టోరీ.

RRR తో ఈ ఇయర్ తెలుగు డెబ్యూ ఇచ్చి ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. సీత పాత్రలో మెప్పించింది. సినిమాలో ఆమె సన్నివేశాలు తక్కువే ఉన్నప్పటికీ ఎన్టీఆర్ , చరణ్ తర్వాత తన నటనతో హైలైట్ గా నిలిచింది. టాలీవుడ్ లో RRR ఇచ్చిన సక్సెస్ తో త్వరలోనే మరిన్ని తెలుగు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది అలియా.

 

విజయ్ దేవరకొండ -పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తన గ్లామర్ తో హీరోయిన్ గా మంచి మార్కులే అందుకుంది.

ఈ ఏడాది ఎవ్వరూ ఊహించని విధంగా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కేరళ కుట్టి నజ్రియా నజీం. కొన్నేళ్ళ క్రితం తెలుగులో నజ్రియా ను పరిచయం చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ ఆమె డెబ్యూ మాత్రం ‘అంటే సుందరానికీ’ తోనే జరిగింది. నాని తో కలిసి లీలా థామస్ పాత్రలో నటించిన నజ్రియా తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో  సినిమాకు హైలైట్ గా నిలిచింది.

  

తెలుగులో ఈ ఇయర్ డెబ్యూ ఇచ్చిన మరో మలయాళ హీరోయిన్ సంయుక్తా మీనన్. పవన్ కళ్యాణ్ -రానా  ‘భీమ్లా నాయక్’ తో మంచి డెబ్యూ ఇచ్చి ఇదే ఏడాది ‘బింబిసార’ తో మరో సక్సెస్ అందుకొని లక్కీ బ్యూటీ అనిపించుకుంది. 2022 ఇచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో వచ్చే ఏడాది సార్, విరూపాక్ష సినిమాల్లో కనిపించబోతుంది.

 

ఈ ఇయర్ ఎంత మంది కొత్త హీరోయిన్స్ టాలీవుడ్ కి వచ్చినా ఆ లిస్టులో టాప్ ప్లేస్ మాత్రం మృణాళ్ ఠాకూర్ దే. మొదటి సినిమాతోనే అందం అభినయం రెండూ చూపించి యువతతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేసి  2022 టాలీవుడ్ బెస్ట్ హీరోయిన్ అనిపించుకుంది. సీత పాత్రతో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచి మంచి సక్సెస్ అందుకుంది. సీతా రామం సక్సెస్ మృణాళ్ తెలుగులో చాలా అవకాశాలు తెచ్చిపెట్టింది.

 

బాలీవుడ్ నుండి ఈ ఇయర్  షెర్లీ సెటియా కూడా టాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చింది. నాగశౌర్య హీరోగా వచ్చిన ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాతో డెబ్యూ ఇచ్చిన షెర్లీ సెటియా రిలీజ్ కి ముందే తన క్రేజ్ ఏంటో ఈవెంట్ లో చూపించింది. కానీ లాక్ ఫ్యాక్టర్ తేడా కొట్టడంతో ఫస్ట్ ఫిలింతో సక్సెస్ అందుకోలేకపోయింది.

 

ఓరి దేవుడా రీమేక్ సినిమాతో కూడా బాలీవుడ్ బ్యూటీస్ మిథిలా పాల్కర్ , ఆశా భట్ టాలీవుడ్ కి పరిచయమయ్యారు. విశ్వక్ సేన్ హీరోగా వెంకటేష్ స్పెషల్ రోల్ చేసిన ఈ సినిమా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకొని మిథిలా , ఆశా ఆశలపై నీళ్ళు చల్లింది. ఈ సినిమాతో ఇద్దరికీ ఆశించిన గుర్తింపు రాలేదు.

 

తన అందం అభినయంతో ఆకట్టుకున్న మరో డెబ్యూ హీరోయిన్ రితికా నాయక్. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘ఆశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో తెలుగులో డెబ్యూ ఇచ్చిన ఈ అమ్మాయి తన కళ్ళతో యువతను ఎట్రాక్ట్  చేసింది. సెకండాఫ్ లో తన పాత్రతో మెప్పించి, హీరోయిన్ గా మంచి మార్కులు దక్కించుకుంది.

సయీ మంజ్రేకర్ కూడా బాలీవుడ్ టు టాలీవుడ్ అంటూ ‘గని’ సినిమాతో ఈ ఏడాది డెబ్యూ ఇచ్చింది. గని ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా ఇదే ఏడాది వచ్చిన  ‘మేజర్’ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. డెబ్యూ ఇచ్చిన ఏడాదిలోనే ఒక ఫేల్యూర్ , ఓ బ్లాక్ బస్టర్ చూసింది.

రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో రజీష విజయన్ కోలీవుడ్ నుండి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది కానీ తెలుగులో ,మొదటి సినిమాతో ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.

అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన కావ్య కళ్యాణ్ రామ్ మసూద అనే సినిమాతో ఈ ఏడాది హీరోయిన్ గా పరిచయమైంది. హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా సక్సెస్ తో డెబ్యూ హీరోయిన్ గా క్లిక్ అయింది. వచ్చే ఏడాది ‘బలగం’ అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కబాలి డబ్బింగ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి ధన్సిక కూడా ఈ ఇయర్ షికారు అనే సినిమాతో తెలుగులో డెబ్యూ ఇచ్చింది. యూత్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పెళ్ళైన గృహిణీగా కనిపించి అలరించింది.

ఇక నువ్వేక్ష , సంజన ఆనంద్ , కాయడు లోహార్ ఇలా మరికొంత మంది కూడా 2022 లిస్టులో ఉన్నారు. ఇందులో ఏ ఒక్కరూ సౌండ్ చేయలేదు.

  * Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics