Mahesh Prabhas NTR - సమ్మర్ వార్ షురూ

Tuesday,May 04,2021 - 02:16 by Z_CLU

వచ్చే ఏడాది సమ్మర్ పోటీ హీట్ పెంచేస్తోంది. అవును స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్పెషల్ గా రాబోతున్నాయి. ఈ పోటి లో ముందున్నాడు ప్రభాస్.

SALAAR_Release-date-locked-zeecinemalu

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్స్ లోకి రానుంది. ఈ మేరకు పర్ఫెక్ట్ గా షెడ్యుల్స్ ప్లాన్ చేశాడు ప్రశాంత్. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ లేకపోతే ఈ పాటికి మరో షెడ్యుల్ కూడా పూర్తయ్యేది. వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా అన్ని షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అదే నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

NTR Koratala new movie zeecinemalu

ఇక ఎన్టీఆర్ -కొరటాల కాంబినేషన్ లో వస్తున్న పవర్ ఫుల్ సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్ కే రానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ‘ఆచార్య’ ను ఫినిష్ చేసే పనిలో ఉన్న కొరటాల ఆ సినిమా పూర్తయిన వెంటనే తారక్ తో చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తాడు. ఈ లోపు రాజమౌళి ‘RRR’ సినిమాను పూర్తి చేస్తాడు ఎన్టీఆర్. ఈ ఇద్దరి కాంబో రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ప్రకటన రోజే చెప్పేశారు.

trivikram MaHESH

2022 సమ్మర్ రేస్ లో మహేష్ కూడా ఉన్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్న మూడో సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల అంటూ ఎనౌన్స్ మెంట్ రోజే ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం మహేష్ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసిన త్రివిక్రమ్ ఆ కథకి మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసే లోపు మహేష్ ‘సర్కారు వారి పాట’ ను ఓ కొలిక్కి తీసుకొస్తాడు. ఆ వెంటనే ఈ కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

సమ్మర్ స్పెషల్ గా థియేటర్స్ లోకి రాబోతున్న ఈ మూడు సినిమాలపై ప్రేక్షకులో భారీ అంచనాలు ఉన్నాయి. మరి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ క్రేజీ కాంబో సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబదతాయో ఎలాంటి విజయాలు అందుకుంటాయో చూడాలి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics