2021 Year End Special : సత్తా చాటిన కొత్త దర్శకులు

Monday,December 20,2021 - 06:40 by Z_CLU

2021 Year End Special : Tollywood Debut Directors

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో కొందరు కొత్త దర్శకులు ఎంట్రీ ఇచ్చి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.  అందులో  కొందరు  విజయం అందుకొని బెస్ట్ డెబ్యూ అనిపించుంటే మరికొందరు కొత్త తరహా కథలతో మంచి ప్రయత్నం చేశారు. 2021 లో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన డెబ్యూ డైరెక్టర్స్ గురించి జీ సినిమాలు స్పెషల్ స్టోరీ.

 Uppena-Director-Buchibabu-2021-debut-directors-list-zeecinemalu1

బుచ్చి బాబు 

అప్పటి వరకూ రెగ్యులర్ లవ్ స్టోరీస్ చూసిన ఆడియన్స్ కి ‘ఉప్పెన’ అనే స్వచ్చమైన ప్రేమకథతో డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందించాడు బుచ్చిబాబు సాన.  ఈ ఏడాది  డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి కలెక్షన్ల సునామి చూపించి బెస్ట్ డెబ్యూ అనిపించుకున్నాడు. తనతో పాటు హీరో వైష్ణవ్ తేజ్  -హీరోయిన్ కృతి శెట్టిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసి వారికి బెస్ట్ ఎంట్రీ క్రియేట్ చేసి క్రేజ్ తీసుకొచ్చాడు. ‘ఉప్పెన’ తో బుచ్చి బాబు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా యింతా కాదు. దర్శకుడిగా తొలి సినిమాతో ఓ ప్రయోగం చేసి దాని ద్వారా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి 100 కోట్ల మార్క్ రీచ్ అవ్వడం అంటే మాములు విషయం కాదు. దర్శకుడిలో ఎంతో స్టఫ్ ఉంటేనే అది వర్కౌట్ అవుద్ది. బుచ్చి బాబు టాలెంట్ గురించి  100 కోట్ల కలెక్షన్సే చెప్పాయి. మొదటి సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ తో ఇప్పుడు రెండో సినిమాను భారీగా ప్లాన్ చేసుకుంటున్నాడు బుచ్చి బాబు.

 HASITH-Director-RajaRajaChora-2021-debut-directors-list-zeecinemalu

హసిత్ గోలి :

శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ‘రాజ రాజ చోర’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన హసిత్ గోలి తన రైటింగ్ స్కిల్స్ , టేకింగ్ తో దర్శకుడిగా హాట్ టాపిక్ అయ్యాడు. సినిమా రిలీజైన రోజు నుండి కొన్ని రోజుల వరకూ ఇండస్ట్రీలో హసిత్ టాలెంట్ గురించి రైటింగ్ గురించి మాట్లాడుకున్నారు. ముఖ్యంగా హసిత్ రాసుకున్న స్క్రీన్ ప్లే కథని దర్శకుడిగా డీల్ చేసిన విధానం అతనికి మంచి పేరు తీసుకొచ్చాయి.

 

శ్రీధర్ గాదే 

సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత వెంటనే రిలీజైన చిన్న సినిమాల్లో కలెక్షన్స్ తో రీ సౌండ్ తెచ్చిన సినిమా ‘SR కళ్యాణ మండపం’.  ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీధర్ మొదటి సినిమాతోనే మంచి కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా సినిమాలో తండ్రి కొడుకుల ఎమోషన్ తో వచ్చే సన్నివేశాలను బాగా డీల్ చేసి తన వర్క్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఫస్ట్ ఫిలిం ఇచ్చిన సక్సెస్ తో రెండో సినిమాను ఓ పెద్ద బేనర్ లో చేయడానికి రెడీ అవుతున్నాడు.

 VijayKanakamedala-Director-Naandi-2021-debut-directors-list-zeecinemalu

విజయ్ కనకమేడల 

హీరో ని ఇప్పటి వరకూ చూడని విధంగా చూపించాలి… కొత్త కథతో మెప్పించాలి.. రెగ్యులర్ సినిమా చేయకూడదు. తన డెబ్యూ సినిమా కోసం ఇవన్నీ ప్లాన్ చేసుకొని సత్తా చాటుకున్నాడు విజయ్ కనకమేడల.  అల్లరి నరేష్ ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసి ఓ మంచి కథతో ‘నాంది’ అనే కొత్త తరహా సినిమా చేసి దర్శకుడిగా మెప్పుపొందాడు. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత సైతం సినిమా చూసి టీంని స్పెషల్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ అభినందించారు. తన మొదటి సినిమాతోనే ఇటు ఇండస్ట్రీ , అటు ప్రేక్షకుల నుండి కాంప్లిమెంట్స్ అందుకున్న విజయ్ కనకమేడల నెక్స్ట్ ఓ అగ్ర హీరోతో రెండో సినిమా చేయబోతున్నాడు.

 కిషోర్ :

తొలి ప్రయత్నం చాలా మంచిదై ఉండాలని ఆలోచించి మంచి సందేశం ఉన్న సినిమా తీయడం అంటే ఏ దర్శకుడికైనా దైర్యం ఉండాలి. అలాంటి దైర్యంతో ‘శ్రీకారం’ అనే  సినిమాతో తన కెరీర్ కి శ్రీకారం చుట్టుకున్నాడు దర్శకుడు కిషోర్. రైతు పడే ఇబ్బందులు చూపించి, రైతుపై గౌరవం తీసుకొచ్చిన సినిమా ‘శ్రీకారం’.  మొదటి సినిమాతోనే ఓ మంచి ప్రయత్నం చేసి దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా ఇలాంటి కథని డీల్ చేయలన్నా, ఎమోషన్స్ పండించాలన్నా.. చాలా అనుభవం కావాలి. కానీ షార్ట్ ఫిలిమ్స్ చేసిన తక్కువ అనుభవంతోనే ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ గా సినిమాను డీల్ చేశాడు కిషోర్.

 

లక్ష్మి సౌజన్య 

పెళ్లి.. దానికి ముందే జరిగే ప్రేమకథ. ఈ కథతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఆ తరహా కథని తన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక మహిళా దర్శకురాలిగా చూపించి మెప్పించారు లక్ష్మి సౌజన్య. నాగ శౌర్య , రీతు వర్మ క్యారెక్టర్స్ ని  డిజైన్ చేసిన తీరు , ప్రేమకథను అందంగా డీల్ చేసిన విధానం దర్శకురాలిగా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి.

 

మున్నా

ఈ ఏడాది మొదటి సినిమాతో ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలనే ఆలోచనతో ఇండస్ట్రీకి వచ్చి దర్శకుల్లో మున్నా ఒకరు. ప్రదీప్ హీరోగా తెరకెక్కిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మున్నా తొలి సినిమాకే జెండర్ స్వైప్ అనే డిఫరెంట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మంచి వసూళ్ళు రాబట్టగాలిగాడు. ప్రదీప్ ఇమేజ్ , రిలీజ్ కి ముందే సాంగ్ వైరల్ అవ్వడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర  మేజిక్ క్రియేట్ చేసింది.

 Director-PadmaSri-ShadiMubarak-2021-debut-directors-list-zeecinemalu

పద్మ శ్రీ

ఒక సినిమా తీయాలంటే మినిమం బడ్జెట్ కూడా అవసరం లేదని, సరైన కథ -కథనం, మంచి సన్నివేశాలు ఉంటే జస్ట్ కారులో హీరో -హీరోయిన్ కి కూర్చుబెట్టి సినిమాను నడిపించి మెప్పించొచ్చని నిరూపించాడు దర్శకుడు పద్మ శ్రీ. రైటర్ గా తనకున్న అనుభవంతో ‘షాదీ ముబారక్’ అనే సినిమా తీసి మొదటి సినిమాతోనే తన టాలెంట్ చూపించి ఆకట్టుకునే సన్నివేశాలతో మెప్పించాడు.

 Director-Koushik-Pegallapati-2021-debut-directors-list-zeecinemalu

కౌశిక్

యంగ్ డైరెక్టర్ కౌశిక్  పెగల్లపాటి కూడా ఈ ఏడాది ఓ కొత్త ప్రయత్నం చేసి దర్శకుడిగా గుర్తింపు అందుకున్నాడు. తొలి సినిమా కోసం ఒక ఫిలాసఫీ ఉన్న కథ తీసుకొని ఎలాంటి అనుభవం లేకపోయినా బాగానే డీల్ చేశాడు. కార్తికేయని ఊర మాస్ రోల్ లో ప్రెజెంట్ చేసి ఓ డిఫరెంట్ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ  ఇచ్చాడు.

 Director-Gowri-Ronanki-PellisandaD-2021-debut-directors-list-zeecinemalu

గౌరి 

‘పెళ్లి సందD’  సినిమాతో రాఘవేంద్ర రావు గారి శిష్యురాలు గౌరీ రోనంకి కూడా ఈ ఏడాది దర్శకురాలిగా పరిచయమైంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ , శ్రీలీల జంటగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టి గౌరి కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

 

అనిల్ పాడురి 

పూరి కాంపౌండ్ నుండి అనిల్ అనే దర్శకుడు కూడా ఈ ఏడాది డెబ్యూ ఇచ్చాడు.  విజువల్స్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్న అనిల్ ‘రొమాంటిక్’ సినిమాతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతో ఆకట్టుకున్నాడు. ఆకాష్ , కేతిక శర్మ జంటగా తెరకెక్కిన ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బేనర్ పై పూరి , చార్మీ నిర్మించారు.

 SriSaripalle-Director-RajaVikramarka-2021-debut-directors-list-zeecinemalu

శ్రీ సారిపల్లి 

ఈ ఏడాది స్పై థ్రిల్లర్ కథతో ‘రాజా విక్రమార్క’  సినిమా తీసి దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీ సారిపల్లి. కార్తికేయ ని స్పై ఏజెంట్ గా చూపించడమే కాక ఈ జానర్ లో కామెడీ మిక్స్ చేసి ఒక ప్రయోగం చేశాడు. అలాగే ఈ ఏడాది ‘A’ అనే సినిమాతో డెబ్యూ ఇచ్చిన యుగందర్ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో సినిమా చేసి డైరెక్టర్ గా మంచి మార్కులు దక్కించుకున్నాడు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics