2021 Year End Special : బెస్ట్ సాంగ్స్ (పార్ట్ 2)

Thursday,December 23,2021 - 06:28 by Z_CLU

ఈ ఏడాది శ్రోతలను బాగా అలరించి, ఆకట్టుకున్న సూపర్ హిట్ సాంగ్స్ లో బెస్ట్ లిస్టు రెండో భాగం చూద్దాం.

జలజలపాతం నువ్వు (ఉప్పెన)

‘ఉప్పెన’ నుండి రిలీజైన ఫస్ట్ సింగిల్ ” నీ కన్ను నీలి సముద్రం” సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో తెలిసిందే. యువతనే కాదు చిన్న పిల్లలను కూడా ఈ సాంగ్ బాగా ఎట్రాక్ట్ చేసి ఒక ఊపు ఊపేసింది. గతేడాది రిలీజైన ఆ సాంగ్ తర్వాత మళ్ళీ ఈ ఆల్బంలో “రంగులద్దుకున్నా” , “జలజల పాతం నువ్వు” బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా జలజల పాతం సాంగ్ రిలీజ్ తర్వాత బాగా పాపులర్ అయింది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్స్ కి శ్రీమణి లిరిక్స్ అందించాడు.

కంటిపాప..కంటిపాప (వకీల్ సాబ్)

ఈ ఏడాది పవన్ కళ్యాణ్ సాంగ్స్ తో హంగామా చేశాడు. అందులో ‘వాకీల్ సాబ్’ సినిమాలోని ‘కంటి పాప’ కూడా ఒకటి. ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి బెస్ట్ సాంగ్స్ లిస్టు లో చేరిపోయింది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. అర్మాన్ మాలిక్ , దీపు , తమన్ పాడిన విధానం కూడా ఆకట్టుకుంది.

జ్వాల రెడ్డి (సీటిమార్)

ఈ ఏడాది మణిశర్మ కూడా తన సాంగ్స్ తో సత్తా చాటుకున్నాడు. ముఖ్యంగా అయన మ్యూజిక్ అందించిన ‘సీటిమార్’ సినిమాలో “జ్వాల రెడ్డి” ఈ ఇయర్ బెస్ట్ మాస్ సాంగ్స్  లిస్టు లో చేరిపోయింది. మణి గారి ఎనర్జిటిక్ ట్యూన్ కి అంతే ఎనర్జిటిక్ లిరిక్స్ అందించి సాంగ్ హైలైట్ అయ్యేలా చేశాడు కాసర్ల శ్యామ్. ముఖ్యంగా తెలంగాణ మాండలికంలో శ్యామ్ రాసిన సాహిత్యం విపరీతంగా ఆకట్టుకుంది. శంకర్ బాబు , మంగలీ సింగింగ్ కూడా సాంగ్ కి ప్లస్ అయ్యింది.

నా కనులు ఎపుడు (రంగ్ దే)

ఈ ఏడాది సిద్ శ్రీరామ్ పాడిన బెస్ట్ సాంగ్స్ లో “నా కనులు ఎపుడు” ఒకటి. ‘రంగ్ దే’ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన ఈ సాంగ్ ని సిద్ శ్రీరామ్ వాయిస్ తో బాగా రీచ్ అయింది. ఆల్బంలో మిగతా పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి కానీ ఈ సాంగ్ మాత్రం ఎక్కువ రీచ్ అయ్యింది. దేవి మెస్మరైజింగ్ ట్యూన్ ,  శ్రీమణి సాహిత్యం , సిద్ శ్రీరామ్ వాయిస్ అన్నీ కలిపి సాంగ్ మిలియన్ల రీచ్ తో పాపులర్ నంబర్ అనిపించుకుంది.

దిగు దిగు నాగు (వరుడు కావలెను)

‘వరుడు కావలెను’ సినిమా కోసం తమన్ కంపోజ్ చేసిన మాస్ సాంగ్ ‘దిగు దిగు నాగ’ కూడా ఈ ఏడాది బెస్ట్ మాస్ సాంగ్స్ లిస్ట్ లో చేరింది. రిలీజ్ అవ్వగానే సాంగ్ వైరల్ అయింది. దీంతో భారీ వ్యూస్ అందుకుంది.  తమన్ ట్యూన్ కి అనంత్ శ్రీరామ్ అందించిన లిరిక్స్ చక్కగా కుదిరాయి. శ్రేయా ఘోషాల్  వాయిస్ తో సాంగ్ అందరినీ ఆకర్షించింది.ఈ సాంగ్ తో పాటు కోల కళ్ళే ఇలా అనే సాఫ్ట్ మెలోడీ కూడా ఆల్బం లో బెస్ట్ సాంగ్ అనిపించుకుంది.

పుట్టెనే ప్రేమ (గల్లీ రౌడీ)

పుట్టెనే ప్రేమ సాంగ్ కూడా ఈ ఏడాది బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. ‘గల్లీ రౌడీ’ సినిమా కోసం రామ్ మిర్యాల కంపోజ్ చేసిన ఈ యూత్ ఫుల్ సాంగ్ కి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా లిరిక్స్ అందించాడు భాస్కర భట్ల రవి కుమార్.  ముఖ్యంగా రామ్ మిర్యాల తనే కంపోజ్ చేసి పాడటం వలన సాంగ్ ఎక్కువగా రీచ్ అయింది.

యే కన్నులు చూడని చిత్రమే (అర్థ శతాబ్దం)

ఈ ఏడాది పాటతో బజ్ వచ్చిన చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ‘అర్థ శతాబ్దం’ అనే సినిమా ఒకటి. ఆ ఆల్బంలోని “యే కన్నులు చూడని చిత్రమే” అనే సాంగ్ బాగా పాపులర్ అయింది. నఫ్సాల్ రాజా కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి సిద్ శ్రీరామ్ వాయిస్ బాగా ప్లస్ అయింది. రెహమాన్ అందించిన లిరిక్స్ కూడా చక్కగా కుదిరాయి.

మందులోడ (శ్రీదేవి సోడా సెంటర్)

మణిశర్మ కంపోజ్ చేసిన మరో మాస్ సాంగ్ “మందులోడ ” అనే సాంగ్ కూడా 2021 బెస్ట్  మాస్ సాంగ్స్ లిస్టు లో మంచి ప్లేస్ అందుకుంది.  ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలోని ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. అందుకే మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది. మణిశర్మ అందించిన మాస్ సాంగ్ కి ఉత్తరాంధ్ర నేపథ్యంలో వచ్చిన ఫోక్ సాహిత్యాన్ని ఆదర్శంగా తీసుకొని మంచి సాహిత్యం అందించాడు కాసర్ల శ్యామ్.

కోలు కోలు(విరాట పర్వం)

ఈ ఏడాది ‘సారంగ దరియా’ తో ఒక ఊపు ఊపేసిన సాయి పల్లవి తాజాగా కోలు కోలు అనే సాంగ్ తో మరోసారి మ్యూజిక్ లవర్స్ ‘కోలు కోలు” సాంగ్ తో మెస్మరైజ్ చేసింది. సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ‘విరాటపర్వం’ ఆల్బం లోని ఈ పాట ఈ ఏడాది బెస్ట్ లవ్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. చంద్ర బోస్ సాహిత్యం పాట స్థాయిని మరింత పెంచేసింది. దివ్య మాలిక పాడిన తీరు కూడా ఆకట్టుకుంది.

ఇది చాలా బాగుంది లే (సెహరి) 

‘సెహరి’ సినిమాలోని సిద్ శ్రీ రామ్ పాడిన  “ఇది చాలా బాగుందిలే” సాంగ్ కూడా సూపర్ హిట్టయింది. సోషల్ మీడియాలో సాంగ్ బాగా పాపులర్ అయింది. దీంతో తొమ్మిది మిలియన్ల మార్క్ దాటి పది మిలియన్ల మార్క్ చేరువలో ఉంది.

బాగుంటుంది నువ్వు నవ్వితే (అతిథి దేవోభవ)

సిద్ శ్రీరామ్ ఇప్పటి వరకూ రొమాంటిక్ డ్యూయెట్ పాడలేదు. కానీ ‘అతిథిదేవో భవ’ సినిమాతో అలాంటి సాంగ్ అతనితో ట్రై చేయించాడు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ అనే సాంగ్ ఈ ఇయర్ బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా మంచి ప్లేస్ అందుకుంది.  ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం బాగా ప్లస్ అయ్యింది.

‘పాగల్ టైటిల్ సాంగ్’ 

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘పాగల్’ సినిమాలో టైటిల్ సాంగ్ అందరినీ ఎట్రాక్ట్ చేసి 2021 బెస్ట్ సాంగ్స్ లో ఒకటి అనిపించుకుంది.  ఈ పాటతో పాటు ఈ సింగిల్ చిన్నోడే సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది. రాధన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ కి చంద్ర బోస్ మ్యూజిక్ అందించారు. రామ్ మిర్యాల ఈ సాంగ్ ని పాడాడు.

ఏమున్నవే పిల్ల(నల్లమల)

సిద్ శ్రీరామ్ సింగింగ్ తో వైరల్ అయిన చిన్న సినిమాల సాంగ్స్ లో  “ఏమున్నవే పిల్ల” కూడా ఒకటి. ‘నల్లమల’ సినిమాలోని ఈ పాట అందరి నోళ్ళలో బాగా నాని మంచి వ్యూస్ అందుకొని ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ అనిపించుకుంది. ఈ సాంగ్ ని కంపోజ్ చేయడమే కాకుండా లిరిక్స్ కూడా తనే రాసుకున్నాడు PR.

కళ్యాణం రమణీయం (పుష్పక విమానం )

ఈ ఇయర్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ లో బాగా వినిపించిన సాంగ్ ఏదైనా ఉంది అంటే అది ‘పుష్పక విమానం’ లోని “కళ్యాణం రమణీయం” సాంగే.  రామ్ మిర్యాల కంపోజ్ చేసిన ఈ వెడ్డింగ్ సాంగ్ ఈ ఏడాది పెళ్ళిళ్ళల్లో గట్టిగా వినిపించి 2021 పాపులర్ సాంగ్స్ లిస్టు లో చేరిపోయింది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యంతో పాటు సిద్ శ్రీరామ్ వాయిస్ కూడా సాంగ్ ని బాగా ఎలివేట్ చేసి వైరల్ అయ్యేలా చేసింది.

 Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics