2021 Year End Special : బెస్ట్ డైరెక్టర్స్

Sunday,December 26,2021 - 10:02 by Z_CLU

2021 Year End Special : Best Directors

2021 లో టాప్ డైరెక్టర్స్ తో పాటు కొత్త దర్శకులు కూడా సత్తా చాటి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టారు. ఈ ఏడాది ‘క్రాక్’ నుండి ‘పుష్ప’ వరకూ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి సూపర్ హిట్లు , బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకులెవరో చూద్దాం.

గోపీచంద్ మలినేని

కోవిడ్ తర్వాత పెద్ద సినిమాగా సంక్రాంతి బరిలో నిలిచిన ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి వసూళ్ళు రాబట్టాడు గోపీచంద్ మలినేని. కొన్ని గంటలు ఆలస్యంగా విడుదలైనప్పటికీ సినిమా చూసి అదంతా మర్చిపోయేలా చేశాడు గోపీచంద్. నిజానికి కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్స్ కి ఆడియన్స్ ఈ రేంజ్ వస్తారని ఎవరూ ఊహించని విధంగా ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించి మా బిర్యానీ పెట్టి మాస్ కంటెంట్ తో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా సినిమాలో గోపీచంద్ టేకింగ్ కి అలాగే స్క్రీన్ ప్లే  కి తన స్టైల్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ కి మంచి మార్కులే పడ్డాయి.  ఈ ఏడాది క్రాక్ సక్సెస్ ఇచ్చిన ఎనర్జీతో నెక్స్ట్ బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు.

 Prashanth Varma

ప్రశాంత్ వర్మ

 ‘జాంబీ రెడ్డి’ తో ఈ ఇయర్ ప్రశాంత్ వర్మ కూడా దర్శకుడిగా మెప్పించి హిట్ అందుకున్నాడు. రాయలసీమలోకి జాంబీ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది ? అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ అందించాడు. దాంతో హాస్యం కోసం ప్రేక్షకులు క్యూ కట్టారు. ముఖ్యంగా తనలో ఉన్న కామెడీ కోణాన్ని రుచి చూపించి ఈ తరహా కథలు కూడా హ్యాండిల్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు.

 director BuchiBabu

బుచ్చి బాబు

పిట్ట కొంచెం కూత ఘనం. ఏ సామెత దర్శకుడు బుచ్చి బాబు కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అవును చూస్తే చిన్న కుర్రాడిలా కనిపించే బుచ్చి బాబు ఈ ఇయర్ ‘ఉప్పెన’ తో దర్శకుడిగా డెబ్యూ ఇచ్చి గ్రాండ్ హిట్ కొట్టాడు. పాటలు , టీజర్ , ట్రైలర్ తో నే బజ్ క్రియేట్ చేసిన ఈ యువ దర్శకుడు ఓ స్వచ్చమైన ప్రేమకథతో ఓ రేంజ్ లో మెస్మరైజ్ చేసి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించి శెభాష్ అనిపించుకున్నాడు. మొదటి సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ తో  రెండో సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నాడు.

 vijay kanakamedala naandhi director

విజయ్ కనకమేడల

లవ్ స్టోరీ , కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథతోనే ఎక్కువ శాతం డెబ్యూ చేస్తుంటారు దర్శకులు. కానీ తను మాత్రం దానికి భిన్నమని ‘నాంది’ అనే డిఫరెంట్ ఫిలిం చేసి అభినందనలతో చెప్పించుకున్నాడు విజయ్ కనకమేడల. అల్లరి నరేష్ లో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించి దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఎంచుకున్న కథ , తీసిన విధానం విజయ్ కి కలిసొచ్చిన అంశం. కొన్నేళ్లుగా హరీష్ శంకర్ దగ్గర వర్క్ చేసిన విజయ్ ఈ ఏడాది బెస్ట్ డైరెక్టర్స్ లిస్టు లో ఓ చోటు దక్కించుకున్నాడు.

 Anudeep-interview-about-JathiRatnalu_zeecinemalu

అనుదీప్

ప్రేక్షకులను కాసేపు ఏదైనా ట్రాక్ తో నవ్వించడమే చాలా కష్టం. అలాంటిది సినిమా అంతా హిలేరియస్ గా నడిపిస్తూ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాలంటే రైటింగ్ లో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ లోనే ఆ హార్డ్ వర్క్ అంతా చేసేసి ఈ ఇయర్ ‘జాతి రత్నాలు’ తో బెస్ట్ ఎంటర్టైన్  మెంట్  అందించి థియేటర్స్ లో నవ్వుల పూవులు పూయించాడు అనుదీప్. మంచి  కామెడీ టైమింగ్ ఉన్న నవీన్ పోలిశెట్టి , రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి దొరకడంతో వాళ్లతో హిలేరియస్ ఫన్ క్రియేట్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మూడో సినిమాను పెద్ద స్కేల్ లో ప్లాన్ చేసుకుంటున్నాడు అనుదీప్.

 venu sriram vakeel saab success celebrations

శ్రీ రామ్ వేణు 

పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాగే చూపిస్తూ ‘వకీల్ సాబ్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వేణు శ్రీ రామ్. ‘పింక్’ సినిమా కథను తన ఇంక్ కొన్ని మార్పులు చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మెప్పించాడు. ఈ రీమేక్ ని ఎవరూ ఊహించని మార్పులతో వేణు శ్రీరామ్ హ్యాండిల్ చేసిన తీరు మెచ్చుకోవాల్సిన విషయం. వకీల్ సాబ్ తో ఈ ఏడాది బెస్ట్ డైరెక్టర్స్ సాబ్స్ లిస్టులో చేరిపోయాడు వేణు శ్రీరామ్

 Srikanth Addala zeecinemalu

శ్రీకాంత్ అడ్డాల

‘బ్రహ్మోత్సవం’ తర్వాత చాలా గ్యాప్ తీసుకునన్ శ్రీకాంత్ అడ్డాల కూడా ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టి దర్శకుడిగా మెప్పించాడు. తమిళ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన ‘అసురన్’ సినిమాను ‘నారప్ప’ గా రీమేక్ చేసి అభినందనలు అందుకున్నాడు. ముఖ్యంగా ఇప్పటి వరకూ చూపించని మాస్ టేకింగ్ చూపించి కమర్షియల్ సినిమాలు కూడా హ్యాండిల్ చేయగలడని నిరూపించుకున్నాడు.

 Hasith-Goli-Interview

హసిత్

ఈ ఏడాది సందడి చేసిన కొత్త దర్శకుల్లో హసిత్ ఒకడు. ఓ సింపుల్ స్టోరీకి మంచి ఎంటర్టైన్ మెంట్, అలాగే ఎమోషన్  యాడ్ చేసి టాలెంట్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్నాడు. దీంతో హసిత్ స్క్రీన్ ప్లే, నెరేషన్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ‘రాజ రాజ చోర’ తో ఈ ఏడాది బెస్ట్ డైరెక్టర్స్ లిస్టు లో సులువుగా చోటు సంపాదించుకున్నాడు హసిత్.

 sekhar kammula

శేఖర్ కమ్ముల

ఈ ఏడాది ‘లవ్ స్టోరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శేఖర్ కమ్ముల కూడా మరోసారి తన సత్తా చాటుకున్నాడు. నాగ , చైతన్య , సాయి పల్లవిలతో ఓ బోల్డ్ పాయింట్ ఉన్న సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ ఇయర్ మంచి కలెక్షన్స్ రాబట్టిన లవ్ స్టోరితో  మరో సారి బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు శేఖర్ కమ్ముల.

 bommarillu-bhasker

బొమ్మరిల్లు భాస్కర్

‘పరుగు’ తర్వాత దర్శకుడు భాస్కర్ కి హిట్ పడలేదు. ఆ లోటు ఈ ఏడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తో తీర్చేసుకొని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. హీరో -హీరోయిన్ మధ్య ఉండే కెమిస్ట్రీ మీద సినిమా అంతా నడిపించి మళ్ళీ తన మార్క్ లవ్ స్టోరీతో అలరించాడు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఐయాం బ్యాక్ అనిపించుకున్నాడు.

 boyapati zeecinemalu

బోయపాటి శ్రీను

ఈ ఏడాది ‘అఖండ’ తో డైరెక్టర్ బోయపాటి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. తన మార్క్ యాక్షన్ తో బాలయ్యని అఘోర గా ప్రెజెంట్ చేసి కాసుల వర్షం కురిపించాడు. ఈ సినిమా ఇచ్చిన కలెక్షన్ల కిక్ తో మరిన్ని భారీ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అంటూ ముందుకొచ్చాయి. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చూపించి బాలయ్యతో హ్యాట్రిక్ కొట్టేసి ఈ ఇయర్ ది బెస్ట్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు బోయపాటి.

 Sukumar-interview-about-pushpa-zeecinemalu

సుకుమార్

నేచురాలిటీ , కమర్షియల్ ఈ రెండూ వేరు. కానీ వాటిని ‘పుష్ప’ తో ఒకటి చేసి తన టేకింగ్ తో తగ్గేదే లే అంటూ బాక్సాఫీస్ కలెక్షన్స్ తో చెప్పి గ్రాండ్ హిట్ కొట్టాడు సుకుమార్. బన్నీ ని పుష్ప రాజ్ అంటూ నెవెర్ బిఫోర్ క్యారెక్టర్ తో ప్రెజెంట్ చేసి సుక్కు ది గ్రేట్ అనిపించుకున్నాడు. ఇయర్ ఎండింగ్ లో ఓ భారీ బ్లాక్ బస్టర్ తో  బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించాడు. ముఖ్యంగా హిందీ , తమిళ్ , మలయాళం, కన్నడలో ఇలా అన్ని భాషల ఆడియన్స్ ని మెప్పించి పుష్ప తో 2021 కి బ్లాక్ బస్టర్ తో బై చెప్పాడు సుక్కు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics