Tollywood Sankranthi - సినిమాలు రెడీ

Monday,January 04,2021 - 01:52 by Z_CLU

టాలీవుడ్ కి సంక్రాంతి అతిపెద్ద సీజన్ అని అందరికీ తెలిసిందే. అందుకే ప్రతీ ఏడాది పొంగల్ కి ఓ నాలుగైదు సినిమాలు పోటీ పడుతూ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడతాయి. గతేడాది మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్  ‘అల వైకుంఠ పురములో’ పోటీ పడి మంచి వసూళ్ళు సాధించాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతి కి నాలుగు సినిమాలు పోటీ పడుతూ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

జనవరి 9 న రవితేజ క్రాక్ థియేటర్స్ లోకి వస్తుండగా జనవరి 13న విజయ్ ‘మాస్టర్’ (డబ్బింగ్ సినిమా) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మరుసటి రోజు జనవరి 14న సంక్రాంతి కానుకగా రెడ్ థియేటర్స్ లోకి ఎంటర్ అవుతుంది. చివరిగా 15న బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ విడుదలవుతుంది.

ఈ సినిమాలకు సంబంధించి దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి. రెడ్ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. ఆన్ లైన్ బుకింగ్ మొదలైంది. ఈ సినిమాలకు సంబంధించి అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

మరి సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టి ఎలాంటి విజయాలు అందుకుంటాయో అని అటు ఆడియన్స్ తో పాటు ఇటు ఇండస్ట్రీ కూడా ఉత్కంఠతో చూస్తోంది.