బెస్ట్ క్యారెక్టర్స్ - 2016

Thursday,December 29,2016 - 08:30 by Z_CLU

2016 లో కొన్ని సినిమాలను తమ క్యారెక్టర్స్ తో విజయం వైపు తీసుకెళ్లారు కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు. అలా సినిమా పై తమ క్యారెక్టర్స్ తో ఇంపాక్ట్ చూపించిన వాళ్ళల్లో జగపతిబాబు, అరవింద్ స్వామి, మోహన్ లాల్… వంటి విలక్షణ నటుల తో పాటు మరి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అలా తమ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో సినిమా పై ఇంపాక్ట్ చూపించిన ఆ క్యారెక్టర్స్ పై ఓ లుక్కేద్దాం.

 

01

 

జగపతిబాబు.. ఈ పేరుచెప్పగానే అప్పట్లో లెజెండ్ మూవీ గుర్తొచ్చినట్టు 2016లో నాన్నకు ప్రేమతో మూవీ గుర్తొస్తుంది. ఇది గుర్తుపెట్టుకో..మళ్లీ మాట్లాడదామంటూ జగపతి చెప్పే డైలాగ్… 2 బంతులతో ఈ నటుడు ఆడే గేమ్ టోటల్ సినిమాకే హైలెట్.

 

02

 

ఇక సత్యరాజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు ఆడియన్స్ కు సత్యరాజ్ అనేకంటే కట్టప్ప అంటేనే గుర్తుపడతారు. బాహుబలి సినిమాతో అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సత్యరాజ్… 2016లో ‘బ్రహ్మోత్సవం’, ‘హైపర్’ సినిమాలతో కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ‘హైపర్’ సినిమాలో ఓ నిజాయితీ గల ఆఫీసర్ క్యారెక్టర్ తో సినిమా కు హైలైట్ గా నిలిచాడు.

 

03

 

2016లో క్యారెక్టర్స్ తో కిర్రాక్ పుట్టించిన నటుల్లో మోహన్ లాల్ ఒకరు.
‘జనతా గ్యారేజ్’ లో ఎన్టీఆర్ హీరో అయితే, మోహన్ లాల్ సెకెండ్ హీరో. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు కూడా. అసలు మోహన్ లాల్ కోసమే ఈ పాత్ర పుట్టిందా అన్నట్టు ఉంటుంది జనతా గ్యారేజ్ లో సత్యం క్యారెక్టర్.

04
2016 ది బెస్ట్ క్యారెక్టర్ లిస్ట్ లో ఆది పినిశెట్టి కూడా ఉన్నారు. ఈ ఇయర్ ‘సరైనోడు’ సినిమా లో తన పర్ఫార్మెన్స్ తో సరి కొత్త విలనిజానికి సరైనోడు అనిపించుకున్నాడు ఆది పినిశెట్టి. సినిమా అంత హిట్ అయిందంటే కారణం, హీరోయిజం తో సమానంగా విలనిజం కూడా ఎలివేట్ అవ్వడమే. అంతటి పవర్ ఫుల్ క్యారెక్టర్ ను అవలీలగా పోషించాడు ఆది.

 

 

05

ధృవ.. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో ధృవ క్యారెక్టర్ తర్వాత వెంటనే గుర్తొచ్చే పాత్ర సిద్దార్థ్ అభిమన్యు. ఈ క్యారెక్టర్ లో అరవింద్ స్వామిని చూసి ఆడియన్స్ నిజంగానే షాకయ్యారు. చేసింది విలన్ పాత్రే అయినా, కొన్ని సీన్స్ లో హీరోని డామినేట్ చేస్తూ, అరవింద్ స్వామి చూపించిన పర్ ఫార్మెన్స్ అదుర్స్.

 

 

06

అటు ప్రతి ఏటా ఓ అద్భుతమైన పాత్రతో పలకరించే రావు రమేష్ కూడా 2016లో తనకంటూ కొన్ని మెమొరబుల్ క్యారెక్టర్స్ ను ఉంచుకున్నాడు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ‘అ..ఆ’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాల గురించే. ఈ రెండు సినిమాలలో తన అమాయకత్వపు యాక్టింగ్ తో ఎంటర్టైన్ చేసాడు రావు రమేష్.

07
2016 బెస్ట్ క్యారెక్టర్స్ లో తండ్రి క్యారెక్టర్ తో ది బెస్ట్ అనిపించుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. సుప్రీమ్ సినిమాలో సాయిధరమ్ తేజ్ కు తండ్రి గా నటించి ఆ క్యారెక్టర్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు ఈ సీనియర్ హీరో.

08
‘జనతా గ్యారేజ్’ సినిమా లో నిజాయితీ గల మున్సిపల్ అధికారి క్యారెక్టర్ తో ఆడియన్స్ మెస్మరైజ్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచాడు రాజీవ్ కనకాల. గతం లో ఎన్నో క్యారెక్టర్స్ తో ఆకట్టుకున్న రాజీవ్ కనకాల మరో సారి ఈ క్యారెక్టర్తో 2016 లో బెస్ట్ అనిపించుకున్నాడు.

 

09
నాని నటించిన ‘జెంటిల్ మెన్’ సినిమాలో ఎవరు ఊహించని క్యారెక్టర్ లో ఎంటర్టైన్ చేసాడు అవసరాల శ్రీనివాస్. వంశీ అనే క్యారెక్టర్ తో ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ కనిపించి సినిమాకు హైలైట్ గా నిలిచి విజయం లో భాగం అయ్యాడు అవసరాల.

 

 

10

‘క్షణం’ సినిమాలో చౌదరి క్యారెక్టర్ కి ఓ ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. ఈ సినిమా విజయం లో ఈ క్యారెక్టర్ చాలా కీ రోల్ పోషించిందనే చెప్పాలి.  చౌదరి గా పోలీస్ క్యారెక్టర్ కి సత్యం రాజేష్ 100 % న్యాయం చేసి సినిమాకు హైలైట్ గా నిలిచాడు.