Karthikeya 2: కృష్ణుడి రూపంలో మానవహారం

Saturday,November 19,2022 - 09:48 by Z_CLU

2000 Girls form Lord Krishna for Karthikeya 2 World Television Premiere in Zee Telugu

– కార్తికేయ 2 జీ తెలుగు ప్రత్యేకమైన మార్కెటింగ్ వ్యూహం
– కార్తికేయ 2 కోసం 2వేల మంది విద్యార్థుల మానవహారం
– శ్రీకృష్ణుడి ఆకారంలో మానవహారం ఏర్పాటు చేశారు
– అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్న జీ తెలుగు మార్కెటింగ్

కార్తికేయ2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం జీ తెలుగు వినూత్నమైన ప్రమోషనల్ యాక్టివిటీస్ తో ముందుకొచ్చింది. ఖమ్మంతోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ విద్యార్థులతో సరికొత్త ప్రచారం ప్రారంభించింది.

దాదాపు 2వేల మంది విద్యార్థుల సహాయంతో శ్రీకృష్ణుడి ఆకారంలో మానవహారం ఏర్పాటుచేసింది జీ తెలుగు. నవంబర్ 20న కార్తికేయ2 ప్రసారం అవుతున్న సందర్భంగా ఈ వినూత్న మార్కెటింగ్ స్ట్రాటజీతో ముందుకొచ్చింది.

ఈ మానవహారం కోసం ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలు వాడారు. దీంతో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని రూపాన్ని చూసేందుకు వీలు కల్పించింది. ఈ 2000 మంది విద్యార్థులు వీక్షకులకు విజువల్ ట్రీట్ అందించారు. దాదాపు 2-నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.