RRR Release Dates - ఒకేసారి 2 డేట్స్ ప్రకటించిన యూనిట్

Saturday,January 22,2022 - 05:23 by Z_CLU

2 Release dates for RRR Movie

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది జనవరి 7న ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తీసిన మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ ‘RRR’ అయ్యేది. కానీ ఓమిక్రాన్ ఎఫెక్ట్ తాకడంతో సినిమా వాయిదా పడింది. సినిమా పోస్ట్ పోన్ అయినప్పటి నుండి కొత్త రిలీజ్ ఎప్పుడెప్పుడు చెప్తారా ? అంటూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు మూవీ లవర్స్. తాజాగా రిలీజ్ కి సంబంధించి రెండు డేట్స్ ప్రకటించి ఇందులో ఒక తేదికి సినిమా థియేటర్స్ లోకి రానుందని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.

దీంతో అసలు ఈ రెండు డేట్స్ ఎందుకు ? ఇందులో ఏ డేట్ కి సినిమా రావొచ్చు ? అనే చర్చ జరుగుతుంది. నిజానికి ప్రస్తుతం ఓమిక్రాన్ పాటు కోవిడ్ ఎఫెక్ట్ కూడా గట్టిగా ఉంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ మూసివేత ఉంటే ఇంకొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం సూచించినట్టుగా యాబై శాతం అక్యూపెన్సి తో థియేటర్స్ రన్ చేస్తున్నారు. ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇప్పుడు కాస్త ఓమిక్రాన్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మళ్ళీ అంతా నార్మల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.

అందుకే ఉన్నపళంగా మరో పెద్ద సినిమా రాకుండా ముందే డేట్స్ ప్రకటించారు. ఇందుకోసం మేకర్స్ ఎంచుకున్న డేట్స్ మార్చ్ 18 లేదా ఏప్రిల్ 28. ఈ రెండు డేట్స్ లో మ్యక్సిమం ఏప్రిల్ 28 నే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది ఇది బాహుబలి 2 రిలీజ్ అయిన డేట్. అంతే కాదు ఈ డేట్ కి ఇంకో మూడు నాలుగు ఇండస్ట్రీ హిట్స్ రిలీజ్ అయ్యాయి. ఇది రాజమౌళి సెంటిమెంట్ అనుకోవచ్చు. అలాగే ఏప్రిల్ నెలాఖరు కల్లా అంతా సద్దుమనగడం ఖాయం. అలాగే ఏప్రిల్ 1న ఆచార్య రిలీజ్ కూడా ప్రకటించి ఉన్నారు. మార్చ్ 18 న వస్తే ఆచార్య తో తెలుగు రాష్ట్రాల్లో RRR కి థియేటర్స్ ఇబ్బంది తప్పదు. అందుకే ఏప్రిల్ 28 నే రిలీజ్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే ఈ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.