చైనాలో గ్రాండ్ గా స్టార్ట్ అయిన 2.O

Saturday,September 07,2019 - 03:20 by Z_CLU

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 2.O సినిమా చైనాలో గ్రాండ్ గా రిలీజైంది. నిన్న శుక్రవారం చైనా అంతటా 48వేలకు పైగా స్క్రీన్స్ పై ఈ సినిమా భారీ ఎత్తున విడుదలైంది. ప్రాధమికంగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం మొదటి రోజు ఈ సినిమాకు 10 లక్షల 40వేల డాలర్లు వచ్చాయి.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారత్ లోనే అతిపెద్ద భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చింది 2.O. రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీగా వసూళ్లు వచ్చాయి. కాకపోతే వరల్డ్ వైడ్ అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది రికార్డు సృష్టించలేకపోయింది. ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో దంగల్, రెండో
స్థానంలో బాహుబలి-2 సినిమాలు కొనసాగుతున్నాయి.

దంగల్ కు ప్రపంచవ్యాప్తంగా 2200 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. చైనాలో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందుకే బాహుబలి-2ను క్రాస్ చేయగలిగింది. ఇక బాహుబలి-2 సినిమా 1800 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు తాజాగా చైనాలో రిలీజైన 2.O సినిమా ఏ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బాహుబలి-2ను రికార్డను క్రాస్ చేయాలంటే చైనాలో 2.O భారీగా హిట్ అవ్వాలి.