బాహుబలి-2 రికార్డును బ్రేక్ చేయబోతున్న 2.O

Monday,December 10,2018 - 12:07 by Z_CLU

రజనీకాంత్-శంకర్ కాంబోలో తెరకెక్కిన 2.O సినిమా బాహుబలి-2ను క్రాస్ చేయడానికి రెడీ అయింది. కాకపోతే ఈ రికార్డు చెన్నైకి మాత్రమే పరిమితం. నిన్నటితో 11 రోజులు పూర్తిచేసుకున్న 2.O సినిమా.. ఈ 11 రోజుల్లో చెన్నైలో 18.41 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.

తన లైఫ్ టైం రన్ లో భాగంగా బాహుబలి-2 సినిమా చెన్నైలో 19 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో.. ఇవాళ్టి కలెక్షన్ తో కలుపుకుంటే 2.O మూవీ, చెన్నైలో బాహుబలి-2ను క్రాస్ చేయడం గ్యారెంటీ.

అటు హిందీలో కూడా 2.O హిట్ అయింది. నిన్నటి వసూళ్లతో కలిపి ఈ సినిమా 150 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది. ఇటు తెలుగులో కూడా ఈ సినిమా స్టడీగా కొనసాగుతోంది.