2.O కలెక్షన్.. వరల్డ్ వైడ్ రూ. 620 కోట్లు

Monday,December 10,2018 - 03:07 by Z_CLU

వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది 2.O మూవీ. సూపర్ స్టార్ నటించిన ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నిన్నటితో 11 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 623 కోట్ల 19 లక్షల రూపాయల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

విడుదలైన 4 రోజులకే వరల్డ్ వైడ్ 400 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా, 11 రోజుల్లో 623 కోట్లు వసూలు చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయడంతో పాటు త్రీడీ వెర్షన్ లో విడుదలవ్వడం 2.O సినిమాకు బాగా కలిసొచ్చింది. వసూళ్లు ఈ స్థాయిలో రావడానికి అదే కారణం.

ఈ నెలంతా ఈ సినిమా హవా కొనసాగుతుందని ట్రేడ్ భావిస్తోంది. ఎందుకంటే ఇటు తెలుగుతో పాటు అటు తమిళ, కన్నడ నాట బడా సినిమాలేవీ థియేటర్లలోకి రావడం లేదు. ఓవర్సీస్ లో మాత్రం క్రిస్మస్ సీజన్ లో కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. అక్కడ మాత్రం 2.Oకు కాస్త థియేటర్లు తగ్గే ఛాన్స్ ఉంది.