ఓవర్సీస్ లో చెక్కుచెదరని రికార్డు సృష్టించిన 2.O

Monday,December 10,2018 - 12:20 by Z_CLU

రజనీకాంత్ స్టామినా ఏంటో మార్కెట్ కు మరోసారి తెలిసొచ్చింది. శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ చేసిన 2.O సినిమా ఓవర్సీస్ లో దుమ్ముదులుపుతోంది. కేవలం తమిళ వెర్షనే ఇప్పటివరకు 5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిందంటే.. ఓవర్సీస్ లో 2.O ఏ రేంజ్ హిట్టో అర్థం చేసుకోవచ్చు.

తాజా వసూళ్లతో ఓవర్సీస్ తో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా నిలిచింది 2.O. మొన్నటివరకు ఈ రికార్డు రజనీకాంత్ పేరుమీదే ఉండేది. అతడు నటించిన కబాలి సినిమా ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా నిలిస్తే, ఇప్పుడా రికార్డును 2.O అధిగమించింది

ఓవర్సీస్ లో ఆల్ టైం టాప్-5 తమిళ సినిమాలు
1. 2.O – $ 5 మిలియన్
2. కబాలి – $ 4.5 మిలియన్
3. కాలా – $ 1.9 మిలియన్
4. మెర్సెల్ – $ 1.8 మిలియన్
5. ఎందిరన్ (రోబో) – $ 1.5 మిలియన్