2.O ఫస్ట్ వీక్ కలెక్షన్.. రూ. 500 కోట్లు

Thursday,December 06,2018 - 04:19 by Z_CLU

రజనీకాంత్, శంకర్ కాంబోలో తెరకెక్కిన 2.O సినిమా సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి ఎంటరైంది. విడుదలైన ఈ వారం రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 500 కోట్ల రూపాయలు వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ వీక్ వసూళ్లలో ఇప్పటికే బాహుబలి-ది బిగినింగ్ సినిమాను క్రాస్ చేసిన 2.O, ఇప్పుడు బాహుబలి-2 రికార్డులపై కన్నేసింది.

ఇండియాలో ఈ సినిమా ఇప్పటివరకు 150 కోట్ల రూపాయల నెట్ రాబట్టింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఏపీ, నైజాంలో 7 రోజుల్లో ఈ సినిమాకు 40 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అయితే బ్రేక్ ఈవెన్ మాత్రం ఇంకా కాలేదు.

ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ (7 రోజుల) షేర్
నైజాం – రూ. 17 కోట్లు
సీడెడ్ – రూ. 6.25 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 5.01 కోట్లు
ఈస్ట్ – రూ. 2.92 కోట్లు
వెస్ట్ – రూ. 2.04 కోట్లు
గుంటూరు – రూ. 2.90 కోట్లు
కృష్ణా – రూ. 2.34 కోట్లు
నెల్లూరు – రూ. 1.56 కోట్లు