4 మిలియన్ క్లబ్ లో చేరిన 2.O

Wednesday,December 05,2018 - 01:26 by Z_CLU

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 2.O సినిమా ఓవర్సీస్ లో దూసుకుపోతోంది. విడుదలైన 6 రోజులకే ఈ సినిమా పెద్ద రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా 4 మిలియన్ క్లబ్ లో చేరింది. తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు త్రీడీ వెర్షన్ కలుపుకొని ఇంత మొత్తం కలెక్ట్ చేసినట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.

ఓ ఇండియన్ సినిమా ఓవర్సీస్ లో ఇలా 6 రోజుల్లోనే 4 మిలియన్ క్లబ్ లో చేరడం ఇదే ఫస్ట్ టైం. బాహుబలి-2 సినిమాకు కూడా 6 రోజుల్లో ఇన్ని వసూళ్లు రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా ఓవర్సీస్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. రజనీకాంత్ కు అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఉండడంతో.. ఈ సినిమా చూసేందుకు ఓవర్సీస్ లో ఇండియన్స్ అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

తాజా వసూళ్లతో ఓవర్సీస్ లో రజనీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది 2.O సినిమా. గతంలో కబాలి సినిమా రజనీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా, ఆ మూవీ ఓవరాల్ కలెక్షన్ ను, జస్ట్ 6 రోజుల్లో అధిగమించింది 2.O.