RC 11 లో మరో ఇద్దరు స్టార్స్

Thursday,February 02,2017 - 03:50 by Z_CLU

RC 11 షూటింగ్ బిగిన్ అయింది. చెర్రీ ధృవ సెట్స్ పై ఉన్నప్పుడు మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన సుకుమార్ తక్కిన స్టార్స్ ని కూడా ఆల్ రెడీ ఫిక్స్ చేసేశాడు. చెర్రీ తరవాత ఈ సినిమాలో హైలెట్ కాబోయే స్టార్స్ ఇప్పుడు టాలీవుడ్ లో సరికొత్త బజ్ ని క్రియేట్ చేస్తున్నారు.

80 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సెన్సిటివ్ లవ్ స్టోరీలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేయబోయే స్టార్స్ జగపతి బాబు, ఆది పినిశెట్టి. అయితే ఈ ఇద్దరు ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారనే క్యూరాసిటీ ఓ రేంజ్ లో రేజ్ అయింది.

rc11-jagapathibabu-aadi-pinishetty

గతంలో జగపతి బాబు శ్రీమంతుడు సినిమాలో ఇన్స్ పైరింగ్ క్యారెక్టర్ లో ఇంప్రెస్ చేసి, ఇమ్మీడియట్ గా సుక్కు డైరెక్షన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు, ఆదికి కూడా మెగా కాంపౌండ్ కొత్తేం కాదు, గతంలోను బన్నితో సరైనోడు సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు. ఓ పర్టికులర్ ఇమేజ్ కి స్టిక్ కాకుండా డిఫెరెంట్ గా దూసుకెళ్తున్న ఈ ఇద్దరు స్టార్స్ RC11 లో ఏం చేయబోతున్నారనేదే ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ క్వశ్చన్.