ఎన్టీఆర్ సినిమాలో కూడా ఇద్దరు

Monday,November 06,2017 - 01:47 by Z_CLU

 

త్రివిక్రమ్ సినిమా అంటే అందులో కచ్చితంగా ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ చేస్తున్న ప్రతి సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ అజ్ఞాతవాసి సినిమాలో కూడా ఇద్దరు భామలున్నారు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఎన్టీఆర్ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లకు చోటున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఒక హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయేల్ ను అనుకుంటున్నారట. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. సెకెండ్ హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం నటి టబును కూడా సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది. త్రివిక్రమ్ రెగ్యులర్ స్టయిల్ లోనే కంప్లీట్ ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడు.