పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ‘2 కంట్రీస్’ టీజర్

Friday,November 24,2017 - 06:19 by Z_CLU

సునీల్ ‘2 కంట్రీస్’ మూవీ టీజర్ రిలీజయింది. అల్టిమేట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ఈ రోజు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సునీల్ సరసన మనీషా హీరోయిన్ గా నటించింది.

ఒక టిపికల్ ఇండియన్ అబ్బాయికి ఫారిన్ అమ్మాయికి పెళ్ళైతే వాళ్ళిద్దరి మధ్య జెనెరేట్ అయ్యే ఫన్ లోడెడ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో హైలెట్ కానున్నాయి. దానికి తోడు సీనియర్ నరేష్, పృథ్వీరాజ్,  శ్రీనివాస్ రెడ్డి మార్క్ కామెడీతో సినిమా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కినట్టు తెలుస్తుంది.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ‘2 కంట్రీస్’ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. N. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ కంపోజర్.  ఈ సినిమా మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.