సౌదీలో విడుదలవుతున్న మొదటి సినిమా

Thursday,December 28,2017 - 04:41 by Z_CLU

దాదాపు 30 ఏళ్లుగా సౌదీలో సినిమాలు బంద్. అక్కడి ప్రజలు సినిమా చూడాలంటే పక్కనే ఉన్న అబుదాబి లేదా యూఏఈకు వెళ్లాలి. ఎట్టకేలకు ఇప్పుడు సౌదీలో సినిమాలపై ఆంక్షలు తొలిగిపోయాయి. వచ్చే ఏడాది మార్చి నుంచి సినిమాల్ని ప్రసారం చేసేందుకు సౌదీ రాజు అనుమతి ఇచ్చాడు.

ఇలా క్లియరెన్స్ పొందిన వెంటనే అలా సౌదీ మార్కెట్ ను ఆక్రమించేందుకు రెడీ అయింది 2.0 సినిమా. ఈ మూవీని దాదాపు 50 స్క్రీన్స్ లో సౌదీలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ 30 ఏళ్లలో ఇండియా నుంచి సౌదీలో విడుదలవుతున్న మొట్టమొదటి చిత్రంగా 2.0 రికార్డు సృష్టిస్తుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకుడు.