2.0 ట్రయిలర్.. ఇది హాలీవుడ్ రేంజ్

Saturday,November 03,2018 - 12:22 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 2.0 సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోందనే విషయంపై ఇప్పటికే అందరికీ ఓ క్లారిటీ ఉంది. అంచనాలు కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రిలీజైంది 2.0 ట్రయిలర్

ఆడియన్స్ సినిమా నుంచి ఏదైతే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో.. సరిగ్గా అవే ఎలిమెంట్స్ ను 2.0 ట్రయిలర్ లో పెట్టారు. సుత్తి లేకుండా సూటిగా యాక్షన్ మోడ్ లోకి ఎంటరైపోయారు. చెప్పాలనుకున్న మేటర్ ను డైరక్ట్ గా చెప్పేశారు. దీంతో 2.0 ట్రయిలర్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది.

చెన్నైలో నిర్వహించిన భారీ కార్యక్రమంలో 2.0 ట్రయిలర్ ను అట్టహాసంగా రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, రెహ్మాన్, ఎమీ జాక్సన్, డైరక్టర్ శంకర్.. ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది 2.0 సినిమా.