'2 .0 ' పోస్ట్ పోన్ ..కారణం అదే...

Saturday,April 22,2017 - 01:20 by Z_CLU

సూపర్ స్టార్-శంకర్ కాంబినేషన్ లో హై బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘2 .0’ రిలీజ్ డేట్ ప్రెజెంట్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది… గతం లో ‘రోబో’ సినిమాతో బిగ్ హిట్ అందుకున్న రజిని-శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కావడం, పైగా అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తుండడంతో ‘2 .0’ పై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి..

ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను మొన్నటి వరకూ నవంబర్ లో దీపావళి కానుకగా రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చాలా నెలలు టైం పడుతుండడంతో ఆ డేట్ ని జనవరి 25 కి పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం. సో ‘2 .0’ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రజిని ఫాన్స్ కి ఈ వార్త కొంత నిరాశ మిగిలిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు…