2.0 ఇది సీక్వెల్ కాదు

Wednesday,October 11,2017 - 03:07 by Z_CLU

రజినీకాంత్ 2.0 సాంగ్ షూటింగ్ ఈ రోజే చెన్నై లో బిగిన్ అయింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని 3D ఫార్మాట్ లో తెరకెక్కిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. అయితే ఈ సినిమా రోబో సినిమాకి సీక్వెల్ కాదని కన్ఫం చేశాడు డైరెక్టర్ శంకర్. గతంలో రిలీజైన  రోబో సినిమాకి, ఈ సినిమాకి ఏ మాత్రం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు.

ఈ రోజే మరో మాసివ్ సాంగ్ షూటింగ్ బిగిన్ చేసిన సినిమా యూనిట్, ఎమీ జాక్సన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. జనవరి 25 న రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న ఈ సినిమా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. A.R. రెహమాన్  మ్యూజిక్  కంపోజర్.