చైనాలో అత్యధిక థియేటర్స్ లో '2.0'....

Monday,September 25,2017 - 04:40 by Z_CLU

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, సెన్సేషనల్ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘2.0’ టైటిల్ తో సీక్వెల్ రెడీ చేస్తున్నాడు శంకర్. భారీ బడ్జెట్‌తో,  హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల చేయబోతున్న మేకర్స్… ఒక్క చైనాలోనే ప‌దిహేను నుండి ప‌ద‌హారు వేల అత్యధిక థియేట‌ర్స్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు . చైనా లో సూపర్ స్టార్ కి ఉన్న క్రేజ్ ,  సినిమాపై ఉన్న భారీ  ఎక్స్పెక్టేషన్స్ దృష్టిలో పెట్టుకునే  ఈ  రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తుంది యూనిట్.

2డీతో పాటు ౩డీ లో కూడా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్ష‌కులకు  తప్పకుండా ఓ సరి కొత్త అనుభూతి కలిగిస్తుందంటున్నారు యూనిట్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా నటిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏ.ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వరిలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్..