టాలీవుడ్ లో 2.0 క్రేజ్

Tuesday,December 27,2016 - 01:30 by Z_CLU

సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా వస్తుందంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా హంగామా మొదలవుతుంది. ఇక తెలుగు లో రజనీకి ఉన్న క్రేజ్ గురించి సెపరేట్ గా చెప్పనక్కర్లేదు. అలాంటిది క్రేజీ సూపర్ స్టార్ రజనీ క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ శంకర్ తో కలిసి వస్తున్నాడంటే  ఆ క్రేజ్ డబుల్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే ‘శివాజీ’,’రోబో’ లతో సంచలన విజయాలు అందుకున్న వీరిద్దరి కాంబోలో ‘2 .0’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

ప్రెజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం క్రేజీ ఆఫర్స్ తో తమిళ నిర్మాతలను సంప్రదిస్తున్నారట టాలీవుడ్ నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రైట్స్ కోసం ఇప్పటికే సాయి కొర్రపాటితో పాటు బెల్లంకొండ సురేష్, మిర్యాల రవీందర్ వంటి నిర్మాతలు కూడా రేస్ లో ఉన్నారు. 50 కోట్లకుగాను సాయి కొర్రపాటి సాటిలైట్ రైట్స్ తో సహా తమిళ ప్రొడ్యూసర్ కు అఫర్ ఇచ్చాడని, కానీ సాటిలైట్ కాకుండా 50 కోట్లకు తెలుగు రైట్స్ మాత్రమే అమ్మేందుకు తమిళ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చర్చల్లో ఉన్న 2.0 తెలుగు రైట్స్ దాదాపు సాయి కొర్రపాటికే దక్కనున్నాయని టాలీవుడ్ టాక్…