ఒక్క పోస్టర్ తో కిక్ ఇచ్చిన 2.0 యూనిట్

Monday,October 23,2017 - 03:34 by Z_CLU

సినిమా తీయడం ఒకెత్తు. దాన్ని డిఫరెంట్ గా ప్రమోట్ చేయడం మరో ఎత్తు. ఈ రెండు విషయాల్లో దర్శకుడు శంకర్ మొనగాడు. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే ఈ దర్శకుడు.. ఆ మూవీకి ప్రచారం కల్పించే విషయంలో కూడా అంతే వినూత్నంగా ఉంటాడు. తాజాగా ఈ దర్శకుడు రజనీకాంత్ హీరోగా 2.0 అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా వస్తున్న ఈ సినిమాకు అదే స్థాయిలో క్రియేటివ్ గా ప్రచారం కల్పిస్తున్నాడు శంకర్.

ఈ పోస్టర్ చూస్తే శంకర్ క్రియేటివిటీ అర్థమౌతుంది. ఈనెల 27న 2.0 ఆడియో రిలీజ్ ఉంది. పాటలు విడుదల చేస్తున్నామని చెప్పడానికి సింబాలిక్ గా ఈ పోస్టర్ విడుదల చేశాడు శంకర్. పియానోపై రెండు చేతుల్ని చూపించాడు. అందులో ఒక చేయి రోబోది కాదా, మరో చేయి సినిమాలో ఏలియన్ పాత్రలో కనిపించే అక్షయ్ కుమార్ ది కావడం విశేషం. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మరోవైపు దుబాయ్ లో 2.0 పాటల వేడుకకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. బుర్జ్ ఖలీఫా పార్క్ లో ఈ ఆడియో వేడుకకు భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడియో రిలీజ్ సందర్భంగా మ్యూజిక్ డైరక్టర్ ఏఆర్ రెహ్మాన్ లైవ్ షో కూడా ఏర్పాటుచేశారు. సిటీ అంతా ఏర్పాటుచేసిన హోర్డింగ్స్ 2.0పై అక్కడి ప్రజల్లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.