జీ తెలుగులో 2.0 ఆడియో రిలీజ్ : ఎక్స్ క్లూజివ్

Friday,November 17,2017 - 02:36 by Z_CLU

రజినీకాంత్ మోస్ట్ అవేటెడ్ మూవీ 2.0 ఆడియో ఈవెంట్ అక్టోబర్ 27 న గ్రాండ్ గా జరిగింది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ హై ఎండ్ టెక్నికల్ ఎంటర్ టైనర్ ఆడియో రిలీజ్ కి దుబాయ్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బుర్జ్ పార్క్ వేదిక అయింది. ఏకంగా 12 కోట్ల భారీ బడ్జెట్ తో జరిగిన ఈ ఆడియో వేడుకలో A.R. రెహమాన్ లైవ్ పర్ఫామెన్స్ హైలెట్ గా నిలిచింది. అయితే ఆ అద్భుతమైన ఈవెంట్ ఇప్పుడు జీ తెలుగుతో పాటు, జీ సినిమాలు చానల్స్ లో ప్రసారం కానుంది.

రానా దగ్గుబాటి, కరణ్ జోహర్ లతో పాటు, RJ బాలాజీ హోస్ట్ చేసిన ఈ సరదాల సందడిలో రజినీకాంత్, శంకర్, ఎమీ జాక్సన్, A.R. రెహమాన్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, సౌందర్య రజినీకాంత్ , విజయ్ ఏసుదాస్, P. వాసులతో పాటు విజయ్ ప్రకాష్ లు ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు.

A.R. రెహమాన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు రోబో, శివాజీ, జీన్స్, జెంటిల్ మెన్ సినిమాల్లోని సాంగ్స్  తో జరిగిన   ట్రిబ్యూ సెలెబ్రేషన్ ఈవెంట్ లో హైలెటెడ్ ఎలిమెంట్ అయితే, ఇక ఎమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ల స్పెషల్ పర్ఫామెన్స్ ఈవెంట్ లో స్పెషల్ మూమెంట్స్ గా నిలిచాయి.

కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమం ఈ ఆదివారం ‘జీ తెలుగు’ లో 4 గంటలకు, జీ సినిమాలు ఛానల్ లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ విజువల్ వండర్ ని జనవరి 25 న రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉంది సినిమా యూనిట్.