2.0 అప్ డేట్స్.. అక్టోబర్ లో ఆడియో రిలీజ్

Thursday,September 07,2017 - 11:30 by Z_CLU

రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ 2.0. రోబోకు సీక్వెల్ గా వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ రోజుకో హంగామాతో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ డీటెయిల్స్ ను బయటపెట్టారు. అక్టోబర్ లో ఆడియోను విడుదల చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశారు.

2.0 టీజర్ విడుదల కార్యక్రమాన్ని ముంబయిలో గ్రాండ్ గా నిర్వహించారు. ఇప్పుడు ఆడియో రిలీజ్ కోసం దుబాయ్ ను వేదికగా ఎంచుకున్నారు. అక్టోబర్ లో దుబాయ్ లో 2.0 పాటల్ని విడుదల చేస్తారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ టూర్ మొదలైన విషయం తెలిసిందే.

దాదాపు 4వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో వస్తున్న 2.0 సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించనున్నాడు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతానికి భారత్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదే.