రెడ్ ఫస్ట్ సింగిల్ రెడీ

Thursday,March 05,2020 - 12:56 by Z_CLU

రెడ్ మూవీ మ్యూజికల్ హంగామా రేపట్నుంచి మొదలుకానుంది. ఇప్పటికే టీజర్ తో హల్ చల్ చేస్తున్న ఈ మూవీ, ఇక పాటలతో సందడి చేయబోతోందన్నమాట. రేపు సాయంత్రం 5 గంటలకు “నువ్వే నువ్వే” అనే లిరిక్స్ తో సాగే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు.

రెడ్ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు రామ్-మణిశర్మ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో పాటలన్నూ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ఆ ఆల్బమ్ కు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో వస్తున్నాయి రెడ్ సాంగ్స్.

కిషోర్ తిరుమల డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ, అమృత అయ్యర్, నివేత పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్రవంతి రవికిషోర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తారు.