1980 తారల 8వ రీయూనియన్ వేడుక

Tuesday,November 21,2017 - 04:18 by Z_CLU

1980’s టాప్ స్టార్స్ 8వ రీయూనియన్ వేడుక ఈ వీకెండ్ సరదాగా జరిగింది. 2  రోజుల పాటు జరిగిన ఈ వేడుక మహాబలిపురం లో  ఇంటర్ కాంటినెంటల్ రిసార్ట్స్ లో గ్రాండ్ గా జరిగింది. నవంబర్ 17 న మార్నింగ్ సన్ గ్లాసెస్ తో, హాయ్వాన్ షర్ట్స్ లో వచ్చిన స్టార్స్ వారి మధ్య స్నేహం ఎలివేట్ అయ్యేలా ఒకే డ్రెస్ కోడ్ ని మెయిన్ టైన్ చేయడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.

సాయంత్రం 7 కల్లా పర్పుల్ డ్రెస్ కోడ్ లో అందరూ ఒకే చోటికి చేరుకున్న ఈ తారలకు సుహాసిని, లిజి, పూర్ణిమ భాగ్యరాజ్ తో పాటు ఖుష్బూ ఈ వేడుకకు హోస్ట్ గా వ్యవహరించారు. దానికి తోడు 1970’s  లోని సూపర్ హిట్ మెలోడి సాంగ్స్ కి రేవతి, ఖుష్బూ చేసిన సోలో పర్ఫామెన్స్, సురేష్-రమ్యకృష్ణ , సుమలత -నరేష్ కలిసి పర్ఫామ్ చేసిన డ్యూయెట్స్ ఎంటర్ టైన్ చేశాయి. ఆ తరవాత జరిగిన ర్యాంప్ వాక్ తో పాటు మరెన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో జరిగిన ఈ ఈవెంట్ లో సరదాగా గడిపారు స్టార్స్.