18Pages మొదటి రోజే బ్రేక్ ఈవెన్
Saturday,December 24,2022 - 05:23 by Z_CLU
నిఖిల్ సిద్దార్థ్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ’18 పేజిస్’ నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది. యూనిక్ కాన్సెప్ట్ తో క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇకపై వచ్చే కలెక్షన్స్ అన్నీ బోనస్ అవ్వనున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే ప్రాఫిట్ వెంచర్ అనిపించుకుంది, నాన్ థియేట్రికల్స్ , థియేట్రికల్స్ రెండు రకాలుగా లాభాలు తెచ్చి పెట్టిన సినిమాగా నిలిచింది.
సుకుమార్ కథతో సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 , సుకుమార్ రైటింగ్స్ పై బన్నీ వాస్ నిర్మించాడు. సుకుమార్ స్టోరీ , ప్రతాప్ స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ , నిఖిల్ -అనుపమ కేరెక్టర్స్ క్లిక్ అవ్వడంతో సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ముఖ్యంగా గోపి సుందర్ ఈ సినిమాకు ఫీల్ కలిగించే మ్యూజిక్ అందించడం బిగ్ ప్లస్ పాయింట్.

- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics