Uppena సాంగ్ ఆ మార్క్ చేరుకుంది !

Monday,December 07,2020 - 06:30 by Z_CLU

కొన్ని పాటలు విడుదలకి ముందే అరుదైన రికార్డులు అందుకుంటూ సినిమాపై అంచనాలు నెలకొల్పుతుంటాయి. ఆ కోవలోకే వస్తుంది Uppena సాంగ్. అవును కొన్ని నెలల క్రితం ఆల్బం నుండి విడుదలయిన మొదటి లిరికల్ సాంగ్ #NeeKannuNeeliSamudram సాంగ్ తాజాగా 150 మిలియన్ వ్యూస్ మార్క్ ని రీచ్ చేసి మ్యూజిక్ లవర్స్ కి ఫేవరేట్ సాంగ్ అనిపించుకుంటుంది.

150m-for-uppena-first-single-news

Devi Sri Prasad ట్యూన్ చేసిన ట్యూన్ కి శ్రీమణి అందించిన సాహిత్యం చక్కగా కుదరడంతో సాంగ్ సెన్సేషనల్ హిట్ సాధించింది. ముఖ్యంగా జావేద్ అలి సింగింగ్ సాంగ్ ని బాగా ఎలివేట్ చేసి అందరినీ ఎట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం యువత ఈ పాటను థియేటర్స్ లో చూడటం కోసం ఎదురుచూస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఉప్పెన సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.మెగా ఫ్యామిలీ నుండి మరో హీరోగా వస్తున్న వైష్ణవ్ తేజ్ కి హీరోయిన్ కృతి శెట్టికి ఇది మొదటి సినిమా.

Also Check ‘ఉప్పెన’ సంక్రాంతి టార్గెట్ ?