The Warriorr బులెట్ సాంగ్ @15 మిలియన్ వ్యూస్

Wednesday,April 27,2022 - 04:25 by Z_CLU

15 Million Views for ‘Bullet’ song from ‘The Warriorr’

ఎనర్జిటిక్ స్టార్ రామ్ , మాస్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ది వారియర్’ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘బులెట్’ భారీ వ్యూస్ కొల్లగొట్టి సూపర్ హిట్ సాంగ్ అనిపించుకుంది. రామ్ – కృతి శెట్టి కాంబినేషన్ లో వచ్చే ఈ డ్యూయెట్ సాంగ్ ప్రస్తుతం తెలుగులో 10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయగా తమిళ్ లో 5 మిలియన్ దాటేసి ఓవరాల్ గా 15 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి శ్రీమణి లిరిక్స్ అందించగా యాక్టర్ సింబు ఈ సాంగ్ ని పాడాడు.  ఈ సాంగ్ రెడీ అయ్యాక దీన్ని ఎవరైనా హీరో పాడితే బాగుంటుందని అభిప్రాయ పడిన టీం ఫైనల్ గా సింబు ని అప్రోచ్ అయ్యారు. సాంగ్ నచ్చడంతో సింబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తన సింగింగ్ టాలెంట్ తో సాంగ్ బాగా రీచ్ అవ్వడానికి రీజన్ అయ్యాడు.

ప్రస్తుతం షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా జులై 14 న థియేటర్స్ లోకి రానుంది.

  * Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics