118 ట్రయిలర్ రివ్యూ

Friday,February 15,2019 - 07:00 by Z_CLU

నందమూరి హీరో కల్యాణ్ రామ్ మరో మూవీ రెడీ చేశాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫ్ కేవీ గుహన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ 118 అనే సినిమా చేశాడు. ఈ మూవీ ట్రయిలర్ ఈరోజు మార్కెట్లోకి వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కిందనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతోంది.

స్టయిలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 118 సినిమాలో షాలినీ పాండే, నివేత థామస్ హీరోయిన్లుగా నటించారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. ట్రయిలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అయిన గుహన్, ట్రయిలర్ లో అద్భుతమైన విజువల్స్ చూపించాడు.

ఈ సినిమా తనకు ఓ మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందంటున్నాడు హీరో కల్యాణ్ రామ్. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని, మార్చి 1న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందంటున్నాడు.