118 మూవీ ఫస్ట్ డే కలెక్షన్

Saturday,March 02,2019 - 02:11 by Z_CLU

కల్యాణ్ రామ్, షాలినీ పాండే, నివేత థామస్ హీరోహీరోయిన్లుగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 118 మొదటి రోజు డీసెంట్ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అటు ఇటుగా కోటి 38 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే, ఇది మంచి కలెక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఏపీ,నైజాంలో ఈ సినిమాను 6 కోట్ల రూపాయలకు అమ్మారట. ఈ లెక్క చూసుకుంటే… మరో 5 రోజుల్లో సినిమా బ్రేక్-ఈవెన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీ, నైజాం మొదటి రోజు షేర్
నైజాం – రూ. 45 లక్షలు
సీడెడ్ – రూ. 15 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 17 లక్షలు
ఈస్ట్ – రూ. 9 లక్షలు
వెస్ట్ – రూ. 7 లక్షలు
గుంటూరు – రూ. 16 లక్షలు
నెల్లూరు – 3 లక్షలు
కృష్ణా – రూ. 11 లక్షలు