భారీ రికార్డు నెలకొల్పిన 'బాహుబలి-2'

Friday,March 24,2017 - 03:01 by Z_CLU

బాహుబలి ది కంక్లూజన్ ట్రయిలర్ ఇలా విడుదలైందో లేదో అలా రికార్డుల వేట మొదలుపెట్టేసింది. యూట్యూబ్ లో ట్రయిలర్ విడుదలైన గంట నుంచే రికార్డులు క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అలా జస్ట్ 8 గంటల్లోనే కోటి వ్యూస్ సాధించడమే కాక ట్రయిలర్ విడుదలై 24 గంటలైనా కాాకముందే… 2కోట్ల వ్యూస్ అందుకుంది. టాలీవుడ్ చరిత్రలోనే ఇదొక బిగ్ రికార్డు. ఇప్పటికే అధిక వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాహుబలి-2 ట్రైలర్ లేటెస్ట్ గా 10 కోట్ల వ్యూస్ తో హాట్ టాపిక్ గా మారింది. .

ఇప్పటికే సినిమా పై భారీ అంచనాలు నెలకొల్పిన ఈ ట్రైలర్ యూట్యూబ్ ఓ భారీ రికార్డు నెలకొల్పి అందరి చేత ఔరా అనిపించింది… సినిమాపై భారీ అంచనాలు ఉండడం, ట్రయిలర్ కోసం ఆడియన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తుండమే ఈ ప్రభంజనానికి కారణం. దీనికి తోడు ఉత్తరాది ప్రేక్షకులు కూడా బాహుబలి-2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమా ట్రయిలర్ ఈ రికార్డు వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న థియేటర్స్ లో సందడి చేయబోతుంది..

https://twitter.com/BaahubaliMovie/status/845197135834365952